1, ఆగస్టు 2010, ఆదివారం

వేమన సూక్తి ముత్కావళి

71) అంతరంగ మెౠగ హరుడౌను గురుడౌను
అంతరంగ మెౠగ నార్యుడగును
అంతరంగ మెఋఇగి నతడెపో శివయోగి
విశ్వదాభిరామ వినురవేమ.

72) అనల మించుకైన గనలి మండునుగాని
చనువుగాని యొౠక మనికి నిడదు
తనువు మఋఅచువాడె తత్త్వఞుడగునయా
విశ్వదాభిరామ వినురవేమ.

73) చదువులన్ని చదివి చాల వివేకియౌ
కపటికెన్నడైన గలదెముక్తి?
నిర్మలాత్మకునకె నిశ్చలంపు సమాధి
విశ్వదాభిరామ వినురవేమ.

74) జక్కి నెక్కి వీధిజక్కగా వెలువడ
గుక్క విన్నివెంట కూయదొడగు
ఘనున కోర్వలేని కాపురుషులు నిట్లె
విశ్వదాభిరామ వినురవేమ.

75) నేరనన్నవాడు నెఋఅజాణ మహిలోన
నేర్తునన్నవాడు వార్తకాడు
ఊరకున్నవాడె యుత్తమోత్తముడయా
విశ్వదాభిరామ వినురవేమ.

76) ఆత్మ తనలోన గమనించి యనుదినంబు
నిర్గుణాత్మార్చనముజేసి నిత్యమమ్ర
ప్రత్యగాత్మను లోనెంచి ప్రబల్యోగి
సచ్చిదానంద పదమందు సతము వేమ.

77) ఇంటిలోని జ్యోతి యెంతయు వెలుగగా
బొరుగువారి యగ్గి కరుగరెపుడు
తాను దైవమాయె, దైవము గొలుచునా?
విశ్వదాభిరామ వినురవేమ.

78) కస్తరి నటు చూడ గాంతి నల్లగ నుండు
పరిమళించు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ.

79) కలుష మానసులకు గాంపింప గారాదు
అడుసు లోన భాను డడగినట్లు
తేట నీరు పుణ్య దేహ మట్లుండురా
విశ్వదాభిరామ వినురవేమ.

80) మాటలాడవచ్చు మనసు దెల్పగలేడు
తెలుప వచ్చు దన్ను తెలియలేడు
సురియబట్టవచ్చు శూరుడు కాలేడు
విశ్వదాభిరామ వినురవేమ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి