30, ఆగస్టు 2010, సోమవారం

ఆంధ్రప్రదేశ్ లో గిరిజన భాషల వ్యాప్తి

ఆంధ్రప్రదేశ్ లో పెక్కు తేగల గిరిజనులు నివసిస్తున్నారు.వారు మాట్లాడే భాషలు కూడా చాల ఉన్నాయి.
వీటిలో కొన్ని భాషలను లక్షలమంది మాట్లాడుతుండగా కొన్ని భాషలను వందలమందే మాట్లాడుతున్నారు.గిరిజనులు ఆంధ్రప్రదేశ్ అంతటా వివిధ జిల్లాలలో ఉన్నారు.ఆదిలాబాద్ జిల్లాలోని ఏజన్సీ ప్రాంతాలలో "ఆద్,భిల్,గోండ్,కొలామ్,ప్రదాన్,తోటి"జాతులవారు అధిక సంఖ్యలో నివాసముంటున్నారు.ఖమ్మం వరంగల్ జిల్లాలలోని ఏజన్సీ ప్రాంతాలు 'కోయల' ప్రదాన నివాసభూమి.ఉభయ గోదావరి జిల్లాల మన్యప్రాంతాలలో 'కొండరేడ్లు'నివసిస్తున్నారు.విశాఖపట్నం ఏజన్సీ ప్రాంతాలలో బగత,మొండీ,దిగాయి,దులియా,ఝాడియా,కోబడి,కోతియో,మూనియా,మావి,మాలకల్,ముకదొర,పరంగి,పుంగు,రెడ్డిదొర,రోన,వాల్మీకి తెగలవారున్నారు.తూర్పు గోదావరి,విశాఖపట్నం,జిల్లాల ఎజన్సీలలో 'ఓజులు'వ్యాపించి ఉన్నారు.విశాఖ,శ్రీకాకుళం ఎజన్సీలలో -"గడబ,గౌడు,జాత,కొదు,కొండదొర,మన్నేదొర" తెగలవారున్నారు.కర్నూలు జిల్లాలో చెంచువారు,గుంటూరు,చిత్తూరు జిల్లాలలో కట్టునాయకన్ తెగలవారు విస్తారంగా ఉన్నారు.కోస్తా జిల్లాలలో;రాయలసీమ జిల్లాలలో ఏనాది,ఎరుకలవారు ఎక్కువగా ఉన్నారు.ఉత్తర తెలంగాణా జిల్లాలలో లంబాడి మరియు నాయక్ తెగలవారు ఉన్నారు.
ఆద్.భిల్ తెగలవారి భాషలగురించి భాషా శాస్త్రవేత్తలకుకుడా స్పష్టంగా తెలియదు.ఆద్ జాతివారు సుమారుగా ౧౨౦౦ (1200)మంది ,భిల్ జాతివారు ఒకవందమంది కంటే ఎక్కువ ఉండరు.
గోండీభాషను ఇటీవల పెక్కుమంది అధ్యయనం చేస్తున్నారు.గోండులు ప్రాచీన సంస్కృతీ కలిగిన జాతి దేవనాగరి ,మరాఠి,రోమన్,తెలుగు లిపులలో గోండి సాహిత్యం వెలువడింది.గోండిభాష మాట్లాడేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది.
కొలామి భాషలో సాహిత్యాన్ని అమెరికన్ భాషాశాస్త్రవేత్త ఎం.బి.ఎమీనో రోమన్ లిపిలో ప్రచురించాడు.కోయాభాషను కొందరు గోండి భాష మాండలికంగా తలచారుగాని అది ప్రత్యేకమైన భాషే.గోండి,కోయ భాషలలో అకాడమీ వారు వాచకాలను ప్రచురిస్తున్నారు.
'కొండరేడ్లు,దాదాపు ౪౦(40)వేలమంది ఉన్నప్పటికీ వారి భాష గురించిన వివరాలు తెలియవు.కొన్ని వందలమంది మాట్లాడే 'తోటి'జాతివారి భాషగురించి కూడా విశేషాలు తెలియవు.'బగత' తెగవారు సుమారుగా ఆరులక్షలమంది ఉన్నప్పటికీ వాళ్ళ భాషగురించి విశేషాలు తెలియవు.అలాగే దిదాయి,ధులియా,ఝులియా,కోబడి,కొటియా,మూలియా.మాలి మాలికర్ తెగలవారి భాషలగురించి కూడా శాస్త్రవేత్తలకు తెలియదు.ఇంకా ముకదోరాలు,పరంగి తెగలు,రెద్దిదొరలూ,రోనతేగా,వాల్మీకులు,గోడులు,జాతాపులు మొదలయిన వారి భాషలపయిన తగిన పరిశోదన జరుగలేదు.
గిరిజనులు మాట్లాడే భాషలలో కొన్నింటిని-పర్జీ,పెంగు మొదలయిన వాటిని ద్రావిడ భాషలుగా పరిశోదకులు గుర్తించారు.
చెంచులు సుమారు ౧౮(18)వేలమంది ఉన్నప్పటికీ వాళ్లభాష గురించి పరిశోదన ఇంకా జరుగలేదు.ఎరుకలభాషను తమిళభాషకు మాండలికంగా భాషాశాస్త్రవేత్తలు గుర్తించారు.సుగాలీలు లేక బంజారాలు మాట్లాడే భాషను రాజస్థానీ మాండలీకంగాతెలుసుకున్నారు.

గిరిజనుల భాషలను గురించి విస్తృతంగా పరిశోదనలు జరిగితెకాని అవి ఏయే భాషా కుటుంబాలకు చెందినవో చెప్పటం కుదరదు.గిరిజనులు మైదాన ప్రదేశాలకు వచ్చినప్పుడు తెలుగు నేర్చుకొని మాట్లాడటం తప్పటంలేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి