2, ఆగస్టు 2010, సోమవారం

అలంకారము

మానవులకు నగలు సౌందర్యము కలిగించును. అలాగే కావ్యములకు ఈ అలంకారములు సౌందర్యమును కలిగించును. అలంకారములు రెండు రకములు. అవి:

శబ్దాలంకారములు:

శబ్దమాత్ర ప్రధానములయినవి శబ్దాలంకారములు.

వృత్త్యానుప్రాసాలంకారము : ఒక హల్లు అనేక పర్యాయములు వచ్చునట్లు చెప్పబడినది. ఉదాహరణ: చొక్క పుటుక్కు క్రిక్కిరిసి స్రుక్కక పెక్కువ నక్క జంబుగన్.

ఛేకానుప్రాసాలంకారము : అర్థ భేదము గల రెండేసి అక్షరములు వ్యవధానము లేకుండా వెనువెంటనే వచ్చుట. ఉదాహరణ: భీకర కర వికరముల్.

లాటానుప్రాసాలంకారము : అర్థభేధము లేక తాత్పర్య భేధము కలుగునట్లు ఒక పదము రెండు సార్లు ప్రయోగింపబడిన అది లాటానుప్రాసము. ఉదాహరణ: శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ.
యమకాలంకారము : అర్థభేదముగల అక్షరముల సమూహమును మరల మరల ప్రయోగింపబడినచో దానిని యమకము అందురు. ఉదాహరణ: పురమునందు నందిపురమునందు.

ముక్తపదగ్రస్తాలంకారము : విడిచిన పద భాగము అవ్యవధానముగా మరల గ్రహించుచు వ్రాయబడిన అది ముక్తపదగ్రస్తము. ఉదాహరణ: ఓ రాజా! శత్రువులను జయించుము, జయించి రాజ్యమును పొందువు. పొంది ప్రజలను పాలింపుము. పాలించి సుఖమును పొందుము.
అంత్యప్రాసాలంకారము : మొదటి పాదం చివరి భాగంలో ఏ అక్షరంతో (అక్షరాలతో) ముగిసిందో, రెండో పాదం కూడా అదే అక్షరంతో (అక్షరాలతో) ముగుసినట్లైతే అది అంత్య ప్రాసం అవుతుంది. ఉదాహరణ: తోటలో నారాజు తొంగి చేసెను నాడు; నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు.


అర్థాలంకారములు:

అర్థ విశేషములను బట్టి వచ్చునవి అర్థాలంకారములు.

1.ఉపమాలంకారం: ఉపమానానికి, ఉపమేయానికి సామ్య రూపమైన సౌందర్యాన్ని సహృదయ రంజకంగా చెప్పడం ఉపమాలంకారం.
2.అన్వయము
3.ఉపమేయోపమ అలంకారం: రెండు వస్తువులకు పర్యాయ క్రమమున ఉపమేయ ఉపమానత్వమును కల్పించి చెప్పడం ఉపమేయోపమ అలంకారం.
4.ప్రతీపాలంకారం : ఉపమానముగా ప్రసిద్ధమయిన దానిని, ఉపమేయంగా కల్పించి చెప్పడం ప్రతీపాలంకారం. అంటే ఉపమానం కావలసింది ఉపమేయంగా మారినందువల్ల రెండింటినీ ఉపమేయాలుగానే భావించవలసి వస్తుంది.
5.రూపకాలంకారం : ఉపమేయమునందు ఉపమాన ధర్మాన్ని అరోపించడం రూపకాలంకారం. ఉపమేయమునకు ఉపమానం తోటి అభేదాన్ని గాని, తాద్రూప్యాన్ని గాని వర్ణించటం రూపకం. ఒకటి అభేద రూపకం, రెండవది తాద్రూప్య రూపకం.
6.పరిణామము
7.ఉల్లేఖాలంకారం : ఒక్క వస్తువే ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా కనిపించడం ఉల్లేఖాలంకారం.
8.స్మృతి
9.భ్రాంతి మదలంకారం : ఒక దానిని చూచి మరొకటిగా భ్రమించినచో అది భ్రాంతిమత్ అలంకారం
10.సందేహాలంకారం : సందేహం (అనిశ్చయ జ్ఞానం) వలన ఏర్పడే అలంకారం సందేహాలంకారం.
11.అపహ్నుతి
12.ఉత్ప్రేక్షాలంకారము : ఉపమానమునందున్న ధర్మాలు ఉపమేయమునందు కూడా ఉండటం వలన ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఉత్ప్రేక్షాలంకారం.
13.అతిశయోక్త్యలంకారము : చెప్పవలసిన దానిని ఎక్కువ చేసి చెప్పడం, గొప్పగా చెప్పడం అతిశయోక్తి అలంకారం.
14.తుల్యయోగిత
15.దీపకాలంకారం : ప్రకృతాప్రకృతములకు ధర్మైక్యం చేసి చెప్పడం దీపకాలంకారం.
16.ఆవృత్తిదీపకము
17.ప్రతివస్తూపమాలంకారం : రెండు వాక్యముల కొక సామాన్య ధర్మముతో అన్వయం ఉంటే అది ప్రతి వస్తూపమాలంకారం. అంటే ప్రతి వాక్యార్ధంలోనూ ఒకే సమాన ధర్మాలను భిన్న పదాలచేత తెలియజేయడం.
18.దృష్టాంతాలంకారము : రెండు వాక్యాల యొక్క వేరువేరు ధర్మాలు బింబ ప్రతిబింబ భావంతో చెబితూ ఉంటే అది దృష్టాంతాలంకారం.
19.నిదర్శన
20.వ్యతిరేకాలంకారం : ఉపమేయ ఉపమానములకు పోలికతో పాటు భేదమును కూడా చెప్పినచో అది వ్యతిరేకాలంకారం.
21.సహోక్తి
22.వినోక్తి
23.సమాసోక్తి
24.పరికరాలంకారం : సాభిప్రాయ విశేషణాలతో కూడినచో అది పరికరాలంకారం.
25.పరికరాంకురము
26.శ్లేషాలంకారము : అనేకార్థాల నాశ్రయించుకొని యుండిన ఎడల అది శ్లేషాలంకారం.
27.అప్రస్తుత ప్రశంసాలంకారం : ప్రస్తుతమును ఆశ్రయించుకొని, అప్రస్తుతమును తలచుకొన్నచో అది అప్రస్తుత ప్రశంసాలంకారం.
28.ప్రస్తుతాంకురము
29.పర్యాయోక్తము
30.వ్యాజస్తుతి అలంకారం : పైకి నిందిస్తున్నట్లుగా కనిపించినా తరచిచూస్తే స్తుతి చేస్తున్న విధం కనిపిస్తుంది. పైకి స్తుతిస్తున్నా తరచిచుస్తే నిందిస్తున్నట్లు కనిపిస్తుంటే వ్యాజస్తుతి అలంకారం.
31.వ్యాజనిందాలంకారం : నింద చేత మరియొక నింద స్ఫురించటం వ్యాజనిందాలంకారం.
32.ఆక్షేపము
33.విరోధాభాసాలంకారం : విరోధమునకు అభాసత్వము కలుగుచుండగా విరోధాభాసం అవుతుంది. పైకి కనిపించే విరోధం విరోధంగా కాకుండా విరోధం ఉన్నట్లుగా అనిపించి, ఆలోచిస్తే ఆ విరోధం అభాసం (పోతుంది) అవుతుంది. కనుక ఇది విరోధాభాసాలంకారం.
34.విభావన
35.విశేషోక్తి అలంకారం : సమృద్ధంగా కారణం ఉండి కూడా కార్యోత్పత్తి జరగక పోవడం విశేషోక్తి అలంకారం.
36.అసంభవము
37.అసంగతి
38.విషమాలంకారం : అనను రూపాలయిన (సమాలు కాని) రెండింటికి సంబంధం వర్ణింపబడిన ఎడల అది విషమాలంకారం.
39.సమము
40.చిత్రము
41.అధికము
42.అల్పము
43.అన్యోన్యము
44.విశేషము
45.వ్యాఘాతము
46.కారణమాల
47.ఏకావలి
48.మాలాదీపకము
49.సారాలంకారం : పూర్వపూర్వముల కంటె ఉత్తరోత్తరాలకు ఉత్కర్ష కలిగించడం సారాలంకారం. ముందున్న వాటి కంటె తర్వాత వచ్చేవాటికి గొప్పతనాన్ని కలిగించడం ఉత్తరోత్తర ఉత్కర్ష అంటారు.
50.యథాసంఖ్య అలంకారం : ఒక దాని తరువాత ఒకటిగా వరుసగా సమాన సంఖ్యాకాలయ్యే వాటి యొక్క సముదాయం యథాసంఖ్య లేదా క్రమ అలంకారం.
51.పర్యాయము
52.పరివృత్తి
53.పరిసంఖ్య
54.వికల్పము
55.సముచ్చయము
56.కారకదీపకము
57.సమాధి
58.ప్రత్యనీకము
59.కావ్యార్థాపత్తి
60.కావ్యలింగాలంకారం : సమర్థనీయమయిన అర్థానికి సమర్థనం కావ్యలింగాలంకారం.
61.అర్థాంతరన్యాసాలంకారం : సామాన్యం చేత విశేషం గాని, విశేషం చేత సామాన్యం గాని సమర్థింప బడితే అది అర్థాంతరన్యాసాలంకారం.
62.వికస్వరము
63.ప్రౌడోక్తి
64.సంభావన
65.మిథ్యాధ్యవసితి
66.లలితము
67.ప్రహర్షణము
68.విషాదము
69.ఉల్లాసము
70.అవజ్ఞ
71.అనుజ్ఞ
72.లేశము
73.ముద్ర
74.రత్నావళి
75.తద్గుణాలంకారం : స్వీయ గుణాన్ని వదిలేసి మరొక దాని గుణాన్ని స్వీకరించటం వర్ణించినట్లయితే అది తద్గుణాలంకారం.
76.పూర్వరూపము
77.అతద్గుణము
78.అనుగుణము
79.మీలితము
80.సామాన్యము
81.ఉన్మీలితము
82.విశేషము
83.ఉత్తరము
84.సూక్ష్మము
85.పిహితము
86.వ్యాజోక్తి
87.గూడోక్తి
88.వివృతోక్తి
89.యుక్తి
90.లోకోక్తి అలంకారం : సందర్భాన్ని అనుసరించి ఒక సామెత లేదా నానుడి చెప్పడం లోకోక్తి అలంకారం.
91.ఛేకోక్తి అలంకారం : లోకోక్తితో పాటు అర్థాంతర స్ఫురణం కూడా ఉండటం ఛేకోక్తి అలంకారం.
92.వక్రోక్తి అలంకారం : శ్లేష వలన గాని, కాకువు వలన గాని అన్యార్ధం కల్పించబడిన అది వక్రోక్తి అలంకారం.
93.స్వభావోక్తి అలంకారం : జాతి, గుణ, క్రియాదుల చేత దాని స్వభావాన్ని వర్ణించిన ఎడల అది స్వభావోక్తి అలంకారం.
94.భావికము
95.ఉదాత్తాలంకారం : సమృద్ధిని గాని, అన్యోపలక్షిత మయిన శ్లాఘ్య చరిత్రను గాని వర్ణించిన ఎడల అది ఉదాత్తాలంకారం అవుతుంది.
96.అత్యుక్తి
97.నిరుక్తి
98.ప్రతిషేధము
99.విధి
100.హేతువు

1 కామెంట్‌: