3, ఆగస్టు 2010, మంగళవారం

సత్తెకాలపు నా యెంకి

"నీ తోటే వుంటాను నాయుడు బావా!
నీ మాటే యింటాను నాయుడు బావా!"


"సరుకులేమి కావాలె సంతన పిల్లా?"
"నువ్వు మరమిడిసి మనసియ్యి నాయుడు బావా!"


"సక్కదనమున కేమిత్తు సంతనపిల్లా?"
"నువ్వు సల్లగుండు పద్దాక నాయుడు బావా!"


"యేడనే నీ కాపురమో యెల్తురు పిల్లా?"

"నీ నీడలోనే మేడ కడతా నాయుడు బావా!"


"నీ తోటే వుంటాను నాయుడు బావా!
నీ మాటే యింటాను నాయుడు బావా!"

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి