లక్షణములు:
ఇంద్ర గణములు మూఁ డిన గణంబొకటి
చంద్రాస్య ! ద్విపదకుఁ జను చెప్పరేచ
ద్విపదకు ద్విపదకుఁ దెగ జెప్పవలయు
నెపుడు సంస్కృతమున నితర భాషలను
యతుల లోపలఁ బ్రాసయతి దక్క సకల
యతులు చెల్లును బ్రయో గాతి సారమున
ద్విపద తో ద్విపద సంధిల నేకశబ్ద
మపుడు రెంటను గూర్ప నది యయుక్తంబు
ఈ పద్యానికి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి (అందుకే దీనిని ద్విపద అంటారు)
ప్రతిపాదములోనీ మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణము ఉంటుంది.
[మార్చు] యతి
యతి: మూడవ గణం యొక్క మొదటి అక్షరం.
ప్రాస:
ప్రాస: ప్రాస ఉన్న ద్విపదను సామన్య ద్విపద, అదే ప్రాస లేకుండా ద్విపద వ్రాస్తే దానిని మంజరీ ద్విపద అని పిలుస్తారు.
[మార్చు] ఉదాహరణలు
గోన బుద్దారెడ్డి గారి రంగనాథ రామాయణము.
||ద్విపద ||
అపరిమిత ప్రీతినా భగీరథుని
తపమిచ్చమెచ్చనే కందర్ప సంహరుని
గణాలు లెక్కిస్తే...
అపరిమి =ఇంద్ర గణము
తప్రీతి = ఇంద్ర గణము
నాభగీ = ఇంద్ర గణము
రధుని = సూర్య గణము
యతి అక్షరాలు
[[అ]]పరిమిత ప్రీతి[[నా]] భగీరథుని
ప్రాస "ప" అక్షరమ్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి