1, ఆగస్టు 2010, ఆదివారం

కందము

లక్షణములు:

కందము త్రిశర గణంబుల, నందము గా భ జ స నలము లటవడి మూటన్

బొందును నలజల నాఱిట, నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్.

పాదాలు: 4
కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. గగ, భ, జ, స, నల ఇవీ ఆ గణాలు
1,3 పాదాలలో గణాల సంఖ్య = 3
2,4 పాదాలలో గణాల సంఖ్య = 5
1,3 పాదాలలో 1,3 గణాలు జ గణం కారాదు
2,4 పాదాలలో 2,4 గణాలు జ గణం కారాదు
2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) జ కాని, నల కానీ అయి ఉండాలి
2,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం గగ లేదా స అయి ఉండాలి
పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతో మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతో మొదలుకావాలి
యతి
2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి

ప్రాస:

ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు
[మార్చు] ఉదాహరణ 2
భూతలనాథుడు రాముడు
ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం
ఘాతన్ భాగ్యోపేతన్
సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్
పై పద్యానికి గణములు లెక్కిస్తే

భ గణము భ గణము భ గణము

గగ గణము గగ గణము జ గణము నల గణము స గణము

గగ గణము గగ గణము గగ గణము

గగ గణము స గణము నల గణము స గణము గగ గణము

భ గణము = UII { గురువు, లఘువు, లఘువు }

గగ గణము = UU { గురువు, గురువు }

జ గణము = IUI {లఘువు,గురువు, లఘువు }

నల గణము = IIII {లఘువు, లఘువు, లఘువు, లఘువు }

స గణము = IIU {లఘువు, లఘువు, గురువు}

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి