81) ఊగియూగి లాగి యున్నది కనగోరు
సాగలాగి పట్టు సాక్షిగాను
యోగమమర ముక్తి నొందును ప్రాఞుండు.
విశ్వదాభిరామ వినురవేమ
82) కనగ సొమ్ము లెన్నొ కనకంబ దొక్కటి
పసుల వన్నె లెన్నొ పాలొకటియె
పుష్పజాతులెన్నొ పూజ యొక్కటె సుమీ.
విశ్వదాభిరామ వినురవేమ
83) కల్ల గురుడు గట్టు కర్మచయంబులు
మధ్య గురుడు గట్టు మంత్రచయము
ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు.
విశ్వదాభిరామ వినురవేమ
84) చెఋఅకు తోటలోన జెత్త కుప్పుండిన
కొంచమైన దాని గుణము చెడదు
ఎౠక గలుగు చోట నెడ్డె వాడున్నట్లు.
విశ్వదాభిరామ వినురవేమ
85) వెఋఋఇవాని మిగుల విసిగింపగా రాదు
వెఋఋఇవాని మాట వినగ రాదు
వెఋఋఇ కుక్క బట్టి వేటాడగా రాదు
విశ్వదాభిరామ వినురవేమ
86) అల్పబుధ్ధివాని కధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పుతినెడికుక్క చెఋఅకు తీపెౠగున?
విశ్వదాభిరామ వినురవేమ.
87) అలమెౠగు యోధు డల్పుని జేరిన
మార్పుచేత బుధ్ధి మరిగి తిరుగు
మ్రానుమ్రాను తిరుగు మర్కట రీతిని
విశ్వదాభిరామ వినురవేమ.
88) కండ చక్కెఋఅయును గలియ బాల్పోసిన
తఋఇమి పాము తన్నుదాకుగాదె
కపటమున్నవాని గంపట్టవలె సుమీ
విశ్వదాభిరామ వినురవేమ.
89) కసినిగల్గి పాపకర్ముల బీడింతు
రల్ల ప్రభులు యముని యల్లభటులు
వ్రుశ్చికంబుగన్న విడుతురే చంపక
విశ్వదాభిరామ వినురవేమ.
90) కులములో నొకడు గుణహీనుడుండిన
(నెట్లో బుర్ర చెడినవాడు నోటికొచ్చింట్లు ఫేలిన)
కులముచెడును వాని గుణమువలన
(నెట్ చెడును వాని దుర్గుణమువలన
ఎలమి చెఋఅకునందు నెన్ను పుట్టినయల్లు
(చెడ్డవాని నోటికి విరేచనములు పట్టీన, మంచివారి
నోరులు మూయబడును.)
విశ్వదాభిరామ వినురవేమ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి