23, ఆగస్టు 2010, సోమవారం

"నాగబు" కధ

వివరాలలోకి వెళ్లేముందు ఈ "నాగబు" చరిత్రని కనుక్కోమని నాలో దీనిని గురించిన ఆసక్తి కలిగించిన వేణు గారికి ధన్యవాదాలు.

అమరావతి స్తూప శిథిలాలలోని రాతి పలక మీద కనిపించిన 'నాగబు' అనే మాటను తెలుగు ప్రాచీనతను గురించి చెప్పటానికి ఉట్టంకిస్తూ ఉంటారు. పగిలిన ఆ రాతి పల క మీద ఉన్నది నాగబు అన్న ఒకే ఒక మాట. ఇది పూర్తిగా తెలుగు మాట కాదనీ, నాగ అనే సంస్క­ృత ప్రాతిపదిక మీద 'బు' అనే తెలుగు ప్రత్యయం చేరగా ఏర్పడి నది అని కూడా చెప్తారు. నాగబును తెలుగు పదం అని మొదటిసారిగా గుర్తించినవారు వేటూరి ప్రభాకర శాస్త్రి. అయితే దీన్ని పురాతత్వవేత్తలు సమర్థించరు. అమరావతిలో దొరికిన శాసనాల లో చాలాచోట్ల 'నాగబుధనికా' 'నాగబుధనో' వంటి పేర్లు కనిపిస్తాయని, 'నాగబు' అనే మాట తో దొరికినది ఒక రాతి ముక్క అని, అది 'నాగబుధనో' లేదా ' నాగబుధనికా' వంటి మాట కల శాసన శిల పగిలిపోగా 'నాగబు' అన్న భాగం మాత్రమే ఉన్న ముక్క మనకు లభించి ఉండవచ్చ నీ వారు అంటారు. అయితే వేటూరి వారి అభిప్రాయాన్ని పూర్తిగా కొట్టిపారవేయలేము. ఎందు కంటే నివబు (నెపము), వక్రబు, పట్టణబు వంటి మాటలు మనకు 575 నించి దొరుకుతున్న తెలు గు శాసనాలలో కనిపిస్తూనే ఉన్నాయి. కనుక బు-ప్రత్యయం కల పదాలు ఆనాడు వాడుకలో ఉండేవి అనటానికి ఇవి సాక్ష్యం అవుతై. అందువల్ల నాగబు తెలుగు మాట కాదు అనలేము.

2 కామెంట్‌లు:

  1. మంచి సమాచారమిచ్చారండీ. పదిహేనేళ్ళ క్రితం అమరావతి వెళ్ళినపుడు ఈ ‘నాగబు’ పదమున్న శాసనం కనపడుతుందేమోనని చాలా వెదికాను. అక్కడ దీని గురించి చెప్పేవాళ్ళు కూడా కనపడలేదు.

    ఇది ‘తొలి తెలుగు మాట’ అనే వాదం ఉంది; అమరావతి శాసనాల్లో అది ఉందంటున్నారు. మరి అక్కడ దాని గురించి ప్రముఖంగా తెలిపే ఏర్పాట్లు చేసివుండాల్సింది కదా... చాలా నిరాశ కలిగింది నాకు! చరిత్ర విషయంలో మనవాళ్ళకు ఎంత అనాసక్తి, నిర్లక్ష్యం ఉన్నాయో కదా!

    ఇన్నేళ్ళ తర్వాత అక్కడ పరిస్థితి మారిందంటారా? ఏమో, నాలాంటి ఆశల్లేవు!

    రిప్లయితొలగించండి
  2. అమరావతి త్రవ్వకాలలో దొరికిన వస్తువులని,శాశనాలలో కొన్ని చెన్నై మ్యూజియం లోనూ,కొన్ని హైదరాబాదు మ్యూజియంలో మరి కొన్ని అమరావతిలో గల మ్యూజియంలోనూ ఉన్నట్టు విన్నాను .ప్రస్తుతం ఆ శాసనం ఎక్కడుందో మరి.మీరు అన్నట్టు మనవాళ్ళ్లకి చరిత్ర విషయంలో చాలా నిర్లక్ష్యం . దీని వల్లనే మన బాషకు ఇంత పురాతనమయిన ,ఘనచరిత్ర కలిగి ఉండి కూడ ఆధారాల కోసం తంటాలు పడవలసి వస్తుంది.

    రిప్లయితొలగించండి