2, ఆగస్టు 2010, సోమవారం

తెలుగులో మొదటి పదం.

ఎప్పుడూ, ఛందస్సు గురించి కాకుండా, అప్పుడప్పుడూ, తెలుగు భాష గురించి తెలుగు పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకోడం ఆసక్తి కరంగా ఉంటుందని భావిస్తూ.. కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను.
ఆంద్ర సాహిత్యం లో మనకు మొదట లభిస్తున్న కావ్యం నన్నయ గారి " ఆంద్ర మహా భారతం" ఐనా, ఆయనకు ఒక శతాబ్దం ముందే మల్లియ రేచనుడు అనే కవి కవి జనాశ్రయము అనే లక్షణ గ్రంధాన్ని తెలుగు లో రాసాడు. కానీ అతని మాటల్లోని "తెలుగు" పదాన్ని సంసయించారు మన కవిపుంగవులు. ఇంకా ప్రాచీనుడు ఉద్యోతనుడు, ఆయన ఆంద్ర ప్రసక్తి చేసాడు తన రచనల్లో. ప్రాకృతం లో రాసిన ఆంద్ర ప్రసక్తి ఉంది చూడండి.
"పియ మహిళా సంగామే సుందర గత్తేయ భోయణే రొద్దే,
అటుపుటు రటుం భణంతే ఆంధ్రే కుమారో సలోయేతి"
అంటే అర్ధం ఏమిటంటే.. పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి ఇలా చెప్పారు.
"అందగత్తెలన్నా..అధవా.. యుద్ధరంగామన్నా..సమానంగా ప్రేమించే వాళ్ళు, అందమైన శరీరాలు గల వాళ్ళూ.. తిండి లో దిట్టలూ... అయిన ఆంధ్రులు... అటూ పుటూ, రటూ, అనుకుంటూ వస్తూ ఉండగా చూచాడు."
తొలి తెలుగు మాట?
మన అమరావతీ స్తూపం, చాలా ప్రాచీనమైనది. క్రీస్తు పూర్వం ౨౦౦ మొదలుకుని క్రీ.స. ౨౦౦ వరకూ అనేక దశలలో దాని నిర్మాణం సాగింది. ఇక్కడ దొరికిన ఒక రాతి పలక మీద "నాగబు" అనే మాట కనపడింది. దీన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఇది తెలుగు పదమని మొదటగా గుర్తించారు.ఇదే మనకు లభించిన మొదటి తెలుగు మాట. ఈ పదం చివరనున్న 'బు' కాలక్రమంలో 'ము'- అంటే ప్రథమా విభక్తి ప్రత్యయంగా మారింది.దాని అసలు సిసలు ద్రావిడ పదం "చెంబు" అంటారు. ఈ వాదాన్ని ఈ గ్రంథ రచయితలు అంతగా పట్టించుకోలేదు. మరికొందరు "గోదబ''ను మొదటి మాటగా నమ్ముతున్నారు.

తెలుగు లిపి పరిణామం మౌర్యుల కాలమునుండి రాయల యుగము దాకా.



ఇప్పుడు గుండ్రంగా ముత్యాల కోవలాగా ఉన్న తెలుగు అక్షరాలు మొదట్లో అష్టావక్రంగా ఉండేవి. క్రీ.పూ. 3వ శతాబ్దంలో 'k' రూపంలో ఉన్న మన తొలి అచ్చు క్రీ.శ. 14వ శతాబ్దానికి అంటే, 1700 సంవత్సరాల తర్తాత 'అ' అన్న రూపంగా ఏర్పడింది.

4 కామెంట్‌లు:

  1. ‘నాగబు’ అంటే అర్థం ఏమిటి? నాగము (పాము) కాదు కదా! ఆ మాటతో ఉన్న వాక్యం, దాని అర్థం చెప్పగలరా?

    రిప్లయితొలగించండి
  2. మీరు చెప్పింది నిజమే నాగబు’ అంటే నాగము (పాము) అని అర్దం.ఆ పూర్తి వాక్యం లభించలేదు.దాని కోసం ప్రయత్నిస్తున్నాను దొరికితే తేలియజెస్తాను

    రిప్లయితొలగించండి
  3. ధన్యవాదాలు రఘు గారూ! ‘నాగబు’ తో కలిసిన పూర్తి వాక్యం మీకు దొరికితే దాని అర్థంతో సహా విడిగా ఓ టపాగా రాయండి. దీనిలో కలిపేయవద్దు!

    రిప్లయితొలగించండి