1, ఆగస్టు 2010, ఆదివారం

మధ్యాక్కర.

లక్షణము:


సురరాజ యుగముతోగూడి సూర్యుతో నొడబడి యుండి
సురరాజ యుగముతోగూడి సూర్యుతో నొడబడి వెండి
కరమొప్ప నీపాట నాఱు గణముల మధ్యాక్కరంబు
విరచింప బ్రావళ్ళు నిట్లు వెలయఁ గవిజనాశ్రయుండ. (నన్నయ గారు 5 వ గణాద్యక్షరం యతి వేసిరి)

పద్యమునకు 4 పాదములు పాదపాదమునకు 2 ఇంద్ర గణములు, 1 సూర్యగణము, 2 ఇంద్ర గణములు, 1 సూర్యగణము, మొత్తం 6 గణములుంటాయి. ప్రాస నియమము కలదు. యతి నాల్గవ గణము మొదటి అక్షరము యతి స్థానము. నన్నయ గారు 5 వ గణము మొదటి అక్షరముతో యతిని కూర్చారు.

ఉదాహరణ.

'తనుమధ్య దా నొక్క కన్యక సురనదీతటమున నన్నుఁ
గనిన నక్కన్యకఁ జూచి నీ విట్టి కమనీయరూప
వొనర నా సుతునకు భార్య వగు మన్న నొడఁబడి యియ్య
కొనియెఁ గావున దానిఁ దగ వివాహ మగుము నెయ్యమునను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి