2, ఆగస్టు 2010, సోమవారం

తెలుగు వచనములు

తెలుగు భాషలో రెండు వచనములు కలవు. అవి. ఏకవచనము మరియు బహువచనము.

ఏకవచనము : ఒక వస్తువును గాని, వ్యక్తిని గురించి తెలుపునది ఏకవచనము. ఉదాహరణ: రాముడు, వనము. కొన్ని పదములు నిత్యైక వచనములుగా ఉపయోగించబడతాయి. ఇవి. వరి, బంగారము, మొదలైనవి.

బహువచనము : రెండు గాని, అంతకంటె ఎక్కువ వస్తువుల గురించి గాని, మనుషులను గురించి గాని చెప్పినది బహువచనము. ఉదాహరణ: బల్లలు, వనరులు. కొన్ని పదములు నిత్య బహు వచనములుగా ఉపయోగించబడతాయి. ఇవి. పాలు, కందులు, పెసలు, మొదలైనవి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి