28, ఆగస్టు 2010, శనివారం

లండన్ సంకల్పం



డాక్టర్ వెలుదండ నిత్యానందరావుగారు రచించిన "తెలుగు సాహిత్యంలో పేరడీ" అనే పుస్తకంలో నుంచి ఒక పేరడీ -



"ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధేశ్వేతవరాహకల్పే...." అని సంకల్పం చెప్పుకోవటం అందరికీ తెలిసిందే కదా...ఇది ఆంధ్రదేశంలో ఉన్న ఆంధ్రులకి సరిపోతుంది. మరి లండన్ లో ఉన్నవాళ్ళు సంకల్పం ఇలా చెప్పుకుంటారు అని చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు తెలియచేస్తున్నారు



"లండన్ వే స్వాహా జూశసే స్వాహ - క్రైస్తవే స్వాహా - ఇంగ్లండ్ - స్కాట్లండ్ - ఐర్లండ్ తత్త్రైస్తోర్వరేణ్యం - జుహోవా దేవస్య ధీమహీ - ధియోయోనః ప్రచోదయాత్" తో మొదలు అయ్యి "భూమేః పూర్వగోళార్థే యూరప్ఖండే, రష్యా, జర్మనీ, ఫ్రాన్సు, స్వీడనేత్యాది మహాదేశానాం పశ్చిమ ప్రాంతే - చతుస్సముద్ర ముద్రిత గ్రేటుబ్రిటన్నామక మహాద్వీపే చవియట్పర్వతస్య దక్షిణ దిగ్భాగే - వేల్సుదేశస్యాగ్నేయభాగే బ్రిస్టల్కుల్యాయాః ప్రాగ్దేశే...అస్మిన్వర్తమాన వ్యావహారిక హూణమానేన క్రీస్తో రనంతరం వింశతి తమ శతాబ్దే ...అఖండ థేంస్ నద్యాం వీరభద్రశర్మాహం జ్ఞానస్నానం కరిష్యే" ఇలా సాగిపోతుంది..




source.maganti.com

2 కామెంట్‌లు:

  1. నేన మీరు చెప్పింది విన్నాను
    జంబు ద్వీపే భరత వర్షే .... కృష్ణ , కావేరి , గోదావరి మద్య దేశే - బదులుగా - లండన్ మహా నగరే , థేమ్స్ నది తీరే ... అని సకల్పం చెప్పటం నేను గుళ్ళో విన్నాను అండి

    రిప్లయితొలగించండి
  2. భలే నవ్వు తెప్పిస్తుంది కదా.

    రిప్లయితొలగించండి