51) ఔనటంచు నొక్కడాడిన మాటకు
కాదటంచు బలుక క్షణము పట్టు
దాని నిలువదీయ దాతలు దిగివచ్చు
విశ్వదాభిరామ వినురవేమ.
52) ఔర! యెంతవార లల్లరి మానవుల్
ప్రభువైన గేలిపఋఅతు రెన్న
దా దెగించువాడు దండియౌ భువిలోన
విశ్వదాభిరామ వినురవేమ.
53) కన్నులందు మదము కప్పి కానరుగాని
నిరుడు ముందటేడు నిన్న మొన్న
దగ్ధులైనవారు తమకంటె తక్కువా?
విశ్వదాభిరామ వినురవేమ.
54) కర్మగుణములన్ని కడబెట్టి నడువమి
దత్త్వమెట్లు తన్ను దగులుకొనును?
నూనె లేక దివ్వె నూవుల వెల్గునా?
విశ్వదాభిరామ వినురవేమ.
55) కసరు తినును గాదె పసరంబు లెప్పుడు
చెప్పినట్లు వినుచుజేయు బనులు
వానిసాటియైన మానవుడొప్పడా?
విశ్వదాభిరామ వినురవేమ.
56) కసవును దినువాడు ఘనఫలంబుల రుచి
గానలేడుగాదె వానియట్లు
చిన్నచదువులకును మిన్నఞానమురాదు
విశ్వదాభిరామ వినురవేమ.
57) ఖరముపాలు తెచ్చి కాచి చక్కెఋఅవేయు
భక్ష్యమగునె యెన్న భ్రష్టుడట్లె
యెంత చెప్పి చివరనెసగిన బొసగునే?
విశ్వదాభిరామ వినురవేమ.
58) గాడ్దెమేనుమీద గంఢంబు పూసిన
బూదిలోన బడచుబొరలు మరల
మోటువాని సొగసు మోస్తరియ్యది సుమీ
విశ్వదాభిరామ వినురవేమ.
59) గ్రుడ్డువచ్చి పిల్ల గోరడాలాడిన
విధముగా నెౠగక వెఋఋఇజనులు
ఞానులైనవారి గర్హింతు రూరక
విశ్వదాభిరామ వినురవేమ.
60) చెఋఅకు తీపిలేమి జెత్తనాబడునట్లు
పరగ గుణములేని పండితుండు
దూఋఅపడునుగాదె దోషమటుండగ
విశ్వదాభిరామ వినురవేమ.
61) చదివి చదివి కొంత చదువంగ చదువంగ
చదువుచదివి యింకజదువు చదివి
చదువుమర్మములను చదువలేడయ్యెను
విశ్వదాభిరామ వినురవేమ
62) తగదు తగదటంచు తగువారు చెప్పిన
వినడు మొఋఅకు చెడును గొనకు నిజము,
మునులు చెప్పు ధర్మముల మీర్నింతెకా
విశ్వదాభిరామ వినురవేమ.
63) తన్నుజూచి యొరులు తగమెచ్చవలెనని
సొమ్ములెఋఅవుదెచ్చి నెమ్మిమీఋఅ
నొరులకొరకుతానె యుబ్బుచునుండును
విశ్వదాభిరామ వినురవేమ
64) తల్లి యున్నయపుడె తనదు గారాబము
లామె పోవ దన్ను నరయ రెవరు
మంచికాలమపుడె మర్యాద నార్జింపు
విశ్వదాభిరామ వినురవేమ
65) తుమ్మచెట్టు ముండ్లు తోడనేపుట్టును
విత్తులోననుండి వెడలునట్లు
మూర్ఖునకును బుధ్ధి ముందుగాబుట్టును
విశ్వదాభిరామ వినురవేమ
66) నీటిలోని వ్రాత నిలువకయున్నట్లు
పాటిజగతిలేదు పరములేదు
మాటిమాటికెల్ల మాౠను మూర్ఖుండు
విశ్వదాభిరామ వినురవేమ
67) పాముకన్న లేదు పాపిష్టి యగు జీవి
యట్టి పాము చెప్పినట్టు వినును
ఇలను మూర్ఖుజెప్ప నెవ్వరి తరమయా
విశ్వదాభిరామ వినురవేమ
68) పొట్లకాయ రాయి పొదుగ ద్రాటను గట్ట
లీలతోడ వంక లేక పెరుగు
కుక్కతోకగట్ట గుదురునా చక్కగా?
విశ్వదాభిరామ వినురవేమ
69) మంచివారు లేరు మహిమీద వెదకిన
కష్టులెందఋఐన గలరు భువిని
పసిడి లేదుగాని పదడెంత లేదయా
విశ్వదాభిరామ వినురవేమ
70) మ్రాను దిద్దవచ్చు మఋఇ వంకలేకుండ
దిద్దవచ్చు రాయి తిన్నగాను
మనసు దిద్దరాదు మహిమీద నెవరికి
విశ్వదాభిరామ వినురవేమ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి