2, ఆగస్టు 2010, సోమవారం

గురు లఘువులను గుర్తించడం.

ఈ పదాలకు గురు లఘువులను గుర్తిద్దాము.
నస - రొండు లఘువులు - I I
అమల - మూడు లఘువులు. - I I I
కాకి - ఒక గురువు ఒక లఘువు. - U I
కైక - ఒక గురువు ఒక లఘువు.- U I
కోకిల - ఒక గురువు, రొండు లఘువులు.- U I I
కెంపు - ఒక గురువు ఒక లఘువు. - U I
కెల - రొండు లఘువులు. - I I
కౌలు - ఒక గురువు ఒక లఘువు. - U I
కృపాణము - ఒక లఘువు, ఒక గురువు, రొండు లఘువులు. IU II
ఇక సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు చూద్దాము.
ద్విత్వాక్షరాలు: ఒక గురువు మరియూ ఒక లఘువు. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరము గురువు, తర్వాతది లఘువు. - U I
అత్త - - U I
అమ్మ - - U I
అవ్వ -- U I
అక్క - - U I
అన్న - - - U I.

సంయుక్తాక్షరాల సంగతి కొంచెం చూద్దాము.
ఇవి కూడా ముందున్న అక్షరాన్ని గురువు గా మార్చి, ఆ సమ్యుక్తాక్షరం లఘువు గా ఉంటుంది.
రక్తము - U I I
అన్య _ U I
పుణ్య - U I
భ్రుగ్న - U I

ఈ సంయుక్తాక్షరాలలో ఇంకో ట్విస్ట్ చెప్తాను గమనించండి జాగ్రతగా..
ఇడ్లీ , కిళ్ళీ వంటి పదాలు, ( U U ) ముందు పదాన్ని గురువు గా మారుస్తాయి, మళ్ళీ ఆ సంయుక్తాక్షరాలు దీర్ఘం తో కూడి ఉన్నాయి కదా అందుకని, ఆ అక్షరం కూడా గురువు అవుతుంది. అంటే రెండు అక్షరాలూ గురువులే నన్నమాట. వచ్చే టపా లో గురులఘువుల సారాంశాన్ని "ముఖ్యమైన గుర్తుంచుకోవలసిన విషయాలు" చెప్పి గురు లఘువుల గుర్తింపు ముగించి, గణ విభజన కు వెళ్దాము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి