2, ఆగస్టు 2010, సోమవారం

తెలుగు సంధులు

ఇవి అచ్చులకును, హల్లులకును చెందియున్నవి.

అచ్చు సంధులు :
అకార సంధి: అత్తునకు సంధి బహుళముగానగు.
ఉదా: మేన+అల్లుడు=మేనల్లుడు.

యడాగమ సంధి: సంధిరాని చోట స్వరంబు కంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా: వెల+ఆలు=వెలయాలు.

ఇకార సంధి: ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
ఉదా: వచ్చితిమి+ఇప్పుడు=వచ్చితిమిప్పుడు

ఉకార సంధి: ఉత్తునకు అచ్చు పరంబగునపుడు సంధియగు
ఉదా: మనము+ఉంటిమి=మనముంటిమి.

ఆమ్రేడిత సంధి: అచ్చునకామ్రేడితంబు పరంబగునపుడు సంధి తరచుగానగు.
ఉదా: ఏమి+ఏమి=ఏమేమి.

హల్లు సంధులు :
గసడదవాదేశ సంధి: ప్రథము మీది పరుషములకు గ-స-డ-ద-వ లు బహుళముగానగు.
ఉదా: వాడు+కొట్టె=వాడుగొట్టె

సరళాదేశ సంధి: ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు
ఉదా: పూచెను+కలువలు=పూచెనుగలువలు

పుంప్వాదేశ సంధి: కర్మధారయంబునందు మువర్ణకంబునకు పుం-పు లగు
ఉదా: సరసము+మాట=సరసపుమాట

ద్విరుక్తటకారాదేశ సంధి: కుఱు-చిఱు-కడు-నడు-నిడు శబ్దముల 'ఱ-డ ' లకు అచ్చు పరంబగునపుడు ద్విరుక్త టకారంబగు.
ఉదా: నడు+ఇల్లు=నట్టిల్లు

టుగాగమ సంధి: కర్మధారయమునందు ఉత్తునకు అచ్చు పరంబగునపుడు టుగాగమంబగు.
ఉదా: పేరు+ఉరము=పేరుటురము

రుగాగమ సంధి: పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరంబగునపుడు కర్మధారయమునందు రుగాగమంబగు
ఉదా: పేద+ఆలు=పేదరాలు

దుగాగమ సంధి: యుష్మత్, అస్మత్, ఆత్మార్ధకంబులకు ఉత్తర పదంబు పరంబగునపుడు దుగాగమంబు విభాషనగు.
ఉదా: నీ+చెలిమి=నీదు చెలిమి

నుగాగమ సంధి: సమాసంబుల ఉదంతంబులగ స్త్రీ సమంబులకు, పు - ంపులకు, పరుష సరళంబులు పరంబులగునపుడు నుగాగమంబగు.
ఉదా: సొగసు+తనము=సొగసుందనము

పడ్వాది సంధి: పడ్వాదులు పరంబగునపుడు ము వర్ణ కంబునకు లోప పూర్ణ బిందువులు విభాషనగు.
ఉదా: భయము+పడె=భయపడె

త్రిక సంధి: ఆ - ఈ -ఏ అను సర్వనామంబులు త్రికంబనబడు.
త్రికము మీది అస0యుక్త హల్లునకు ద్విరుక్త0బు పర0బుగనగు. ద్విరుక్త0బగు హల్లు పర0బగునప్పుడు ఆచ్ఛిక0బబబైన దీర్గ0నకు హ్రస్వ0బగు

ఉదా: అక్కడ = ఆ+కడ; ఇక్కడ 'ఆ' అనునది .త్రికము మరియు 'క' అనునది అస0యుక్త హల్లు. కనుక ద్విరుక్త0బు వచ్చి ఆ+క్కడ ఐనది. ద్విరుక్త0బగు 'క్క' పర0బుగనప్పుడు 'ఆ' దీర్గ0 కాస్త హ్రస్వ0బై 'అ' అవుతు0ది = అక్కడ

ద్విగు సమాస సంధి: సమానాధికరణంబగు ఉత్తర పదంబు పరంబగునపుడు 'మూడు' శబ్దములోని 'డు' వర్ణమునకు లోపంబును, మీది హల్లునకు ద్విత్వంబునగు.
ఉదా: మూడు+లోకములు=ముల్లోకములు.

బహువ్రీహి సమాస సంధి: బహువ్రీహిని స్త్రీ వాచ్యంబునగుచో ఉపమానంబు మీది మేనునకు బోడియగు.
ఉదా: అలరు+మేను=అలరుఁ బోడి.

ప్రాతాది సంధి: సమాసంబులన్ ప్రాతాదుల తొలి యచ్చుమీది వర్ణంబుల కెల్ల లోపంబు బహుళంబుగానగు.
ఉదా: క్రొత్త+గండి=క్రొగ్గండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి