2, ఆగస్టు 2010, సోమవారం

తెలుగు వాక్యము

విషయమును అర్థవంతముగాను, సంపూర్ణము గాను స్పష్టముగాను భావప్రకటనమును కలిగించెడి పదముల సముదాయమును వాక్యము అందురు. వాక్యములో మూడు ప్రధానమైన భాగములు ఉండును.

హిందూమతం లోని ఆధ్యాత్మిక , ఉపనిషత్తుల సారము నాలుగు మహా వాక్యాలు. ఒక్కొక్క వేదం యొక్క సారమే ఒక మహావాక్యంగా ఈ మహావాక్యాలు చెబుతాయి.




భాగాలు:

కర్త : ఒక పనిని చేయువారు.

కర్మ: ఆ పని యొక్క ఫలితములను అనుభవించునది.

క్రియ: పనిని తెలియజేయు పదము.


రకాలు:

సంపూర్ణ వాక్యము: సమాపక క్రియలో పూర్తి అగునట్టి వాక్యమును సంపూర్ణ వాక్యము లేదా సామాన్య వాక్యము అందురు. ఉదా: కల్యాణమండపములో వివాహము జరుగుతున్నది.

అసంపూర్ణ వాక్యము: అసమాపక క్రియలలో వాడిన వాక్యమును అసంపూర్ణ వాక్యము అందురు. ఉదా: నేను దేవాలయమునకు వెళ్ళి,

అవాంతర వాక్యము: ఒక సంపూర్ణము కాని వాక్యమును, ప్రసంగమున మధ్యలో వచ్చెడి వాక్యమును అవాంతర వాక్యము అందురు. ఉదా: తగిన ఇంధనము లేనిచో విమానము ఎగురలేదు.

సంశ్లిష్ట వాక్యము: సంపూర్ణ వాక్యములను, అవాంతర వాక్యములను కలిగియుండి పూర్తి అర్ధము నిచ్చు వాక్యమును సంశ్లిష్ట వాక్యము అందురు. ఉదా: నీవు సక్రమముగా పోటీకి వచ్చి ప్రశ్నలకు శ్రద్ధగా సమాధానములు వ్రాయగలవు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి