11) ఎడ్డెవానికి గురుతోర్చి చెప్పినగాని
తెలియబడునె యాత్మ దెలివిలేక
చెడ్డ కొడుకు తండ్రి చెప్పిన వినడయా
విశ్వదాభిరామ వినురవేమ.
12) కండ చక్కెఋఅయును గలియ బాల్పోసిన
తఋఇమి పాము తన్నుదాకుగాదె
కపటమున్నవాని గంపెట్టవలె సుమీ
విశ్వదాభిరామ వినురవేమ.
13) కలియుగంబునందు ఘనతకు నైచ్యము
ఘనత నైచ్యమునకు గలుగుచుండు
శ్రధ్ధ భక్తులుడిగి జనులుంద్రు కావున
విశ్వదాభిరామ వినురవేమ
14) కల్లుకుండకెన్ని ఘనభూషణము లిడ్డ
అందులోని కంపు చిందులిడదె?
తులవ పదవిగొన్న దొలి గుణమేమగు?
విశ్వదాభిరామ వినురవేమ.
15) కానివానితోడగలసి మెలంగిన
హానివచ్చు నెంతవానికైన
కాకిగూడి హంస కష్టంబు పొందదా?
విశ్వదాభిరామ వినురవేమ.
16) కూళ కూళ్ళుమేయు గుణమంత చెడనాడి
నెట్టివారు మెచ్చరట్టివాని
కొయ్యదూలమునకు గుదురునా ఞానంబు?
విశ్వదాభిరామ వినురవేమ.
17) కైపుమీౠవేళ గడకుజేరగరాదు
అనువుదప్పి మాటలాడరాదు
సమయమెౠగనతడు సరసుండుకాడయా?
విశ్వదాభిరామ వినురవేమ.
18) కొండగుహలనున్న గోవెలందున్న
మెండుగాను బూది మెత్తియున్న
దుష్టబుధ్ధులకును దుర్బుధ్ధి మానునా?
విశ్వదాభిరామ వినురవేమ.
19) కోతిబట్టి తెచ్చి క్రొత్తపుట్టముగట్టి
కొండమ్రుచ్చులెల్ల గొలిచినట్లు
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వదాభిరామ వినురవేమ.
20) గంగపాౠచుండ గదలని గతితోడ
ముఋఇకివాగు పాౠ మ్రోతతోడ
అధికుడొర్చునట్టు లధముడోర్వగలేడు
విశ్వదాభిరామ వినురవేమ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి