1, ఆగస్టు 2010, ఆదివారం

వేమన సూక్తి ముత్కావళి

21) చదువులన్ని చదివి చాలవివేకియై
కలుషచిత్తుడైన ఖలుని గుణము
దాలిగుంటగుక్క తలచిన చందమౌ
విశ్వదాభిరామ వినురవేమ.

22) చంపగూడ దెట్టి జంతువునైనను
చంపవలయు లోకశత్రుగుణము
తేలుకొండిగొట్ట దేలేమిచేయురా
విశ్వదాభిరామ వినురవేమ.

23) ఛర్ధి పుట్టినప్డు సాపడసైపదు
నాతిగన్న యప్డు నీతి తగదు
చేటు మూడినపుడు మాటలు తోచవు
విశ్వదాభిరామ వినురవేమ.

24) టక్కరులను గూడి యొక్క సక్కెములాడ
నిక్కమైన ఘనుని నీతిచెడును
ఉల్లితోట బెరుగు మల్లెమొక్కకరణి
విశ్వదాభిరామ వినురవేమ.

25) డెందమందు దలచు దెప్పరమెప్పుడు
నోర్వలేనిహీను డొరునికట్టె
తనకు మూడుసుమ్మి తప్పదెప్పటికైన
విశ్వదాభిరామ వినురవేమ.

26) తనకుగలుగు పెక్కు తప్పులటుండగా
పరులనేరుచుండు నరుడు తెలియ
డొడలెౠంగ డనుచు నొత్తి చెప్పంగవచ్చు
విశ్వదాభిరామ వినురవేమ.

27) తనర న్రుపతితోడ దగ దుర్జనునితోడ
అగ్నితోడ బరుని యాలితోడ
హాస్యమాడుటెల్ల నగును ప్రాణాంతము
విశ్వదాభిరామ వినురవేమ.

28) తేలుకుండును తెలియగొండి విషంబు
ఫణికినుండు విషము పండ్లయందు
తెలివిలేని వాండ్ర దేహమెల్ల విషంబు
విశ్వదాభిరామ వినురవేమ.

29) దాసరయ్య తప్పు దండంబుతో సరి
మోసమేది తన్ను ముంచుకున్న?
నీచుడై చెడునటు నీచుల నమ్మిన
విశ్వదాభిరామ వినురవేమ.

30) దుండగీడు కొడుకు కొండీడు చెలికాడు
బండరాజునకును బడుగుమంత్రి
కొండముచ్చునకును కోతియె సరియగు
విశ్వదాభిరామ వినురవేమ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి