1) అగ్నిచేతబట్టి యా పరమేశుని
నిందచేసి నరులు నీరుకారె?
దక్షు క్రతవులోని తల్లడమెౠగరా?
విశ్వదాభిరామ వినురవేమ.
2) అంతరంగమందు నపరాధములు చేసి
మంచివానివలెనె మనుజుడుండు
ఇతరు లెౠగకున్న నీశ్వరుడెౠగడా?
విశ్వదాభిరామ వినురవేమ.
3) అంతరాత్మగనక యల్పబుధ్ధులతోడ
మెలగెడు జనులెల్ల మేదినిపయి
యముని నరకమునకు నరుగంగ సాక్ష్యము
విశ్వదాభిరామ వినురవేమ.
4) అధికుడైన రా జొకల్పుని జేపట్ట
వానిమాట చెల్లు వసుధలోన
గణకు లొప్పియున్న గవ్వలు చెల్లవా?
విశ్వదాభిరామ వినురవేమ.
5) ఇనుము విఋఇగెనేని యినుమాౠ ముమ్మాౠ
కాచి యతుకనేర్చు గమ్మరీడు
మనసు విఋఇగినేని మఋఇయంట నేర్చునా?
విశ్వదాభిరామ వినురవేమ.
6) ఎంత సేవచేసి యేపాటు పడినను
రాచమూక నమ్మరాదురన్న
పాముతోడిపొందు పదివేలకైనను
విశ్వదాభిరామ వినురవేమ.
7) ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ?
వివరమెఋఇగి చూడు వ్రుత్తియందు
నేర్పులేనివాని నెఋఅయోధుడందురా?
విశ్వదాభిరామ వినురవేమ.
8) ఒకరి నోరుకొట్టి యొకరు భక్షించిన
వాని నోరు మిత్తి వరుసగొట్టు
చేపపిండు బెద్ద చేపలు చంపును
చేపలన్ని జనుడు చంపు వేమ.
9) కల్ల నిజముజేసి కపటభావముజేంది
ప్రల్లదంబులాడు భక్తిలేక
మాయలాడుఖలుడు మహితాత్ముసాటియా?
విశ్వదాభిరామ వినురవేమ.
10) గుఋఋఅమునకు దగిన గుౠతైన రౌతున్న
గుఋఋఅములు నడచు గుౠతుగాను
గుర్తు దుర్జనులకు గుణము లిట్లుండురా
విశ్వదాభిరామ వినురవేమ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి