1, ఆగస్టు 2010, ఆదివారం

వేమన సూక్తి ముత్కావళి

166) చదివి నతని కన్న చాకలియే మేలు
కులము వేల్పు కన్న కుక్క మేలు
సకల సురల కన్న జారభామిని మేలు
విశ్వదాభిరామ వినురవేమ.

167) జంత్ర మంత్ర మహిమ జాతవేదుడెౠంగు
మంత్రవాది యెౠగు దంత్ర మహిమ
తంత్రిణీక మహిమ దినువాడెౠంగును
విశ్వదాభిరామ వినురవేమ.

168) తగిన కులజుడైన తన యెత్తు ధనమైన
పరపురుషుని నేల పట్ట వచ్చు?
పరమ సాధ్వి చూడ నొరుల నంటదు సుమా
విశ్వదాభిరామ వినురవేమ.

169) ఝషము నీరు వెడల జచ్చుటే సిద్ధము
నీట నుండె నేని నిక్కి పడును
అండ తలగు నెడల నందఋఇ పని యట్లె
విశ్వదాభిరామ వినురవేమ.

170) జన్మములను మఋఇయు జన్నియల ననేక
ముల నొనర్చియున్న ఫలము కాన
రాక యుండు నీతి లేకున్న మాత్రాన
విశ్వదాభిరామ వినురవేమ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి