1, ఆగస్టు 2010, ఆదివారం

వేమన సూక్తి ముత్కావళి

171) డీకొనంగ దగదు డెంద మెౠంగక
యడుగ వచ్చి కొంత యనిన వాని
చెప్పునంత నినియు మెప్పుగా బలుకుమీ
విశ్వదాభిరామ వినురవేమ.

172) తగవు తీర్చువేళ ధర్మంబు దప్పిన
మానవుండు ముక్తి మానియుండు
ధర్మమునె పలికిన దైవంబు తోడగు
విశ్వదాభిరామ వినురవేమ

173) ఇచ్చకము భువి నవశ్యము
కుచ్చిత మిహిలోక నింద కోవిదునకు నీ
తచ్చననె హాని వచ్చును
మచ్చరమే తన్ను చెఋఅచు మహిలో వేమా.

174) నిజము లాడు వాని నిందించు జగమెల్ల
నిజము బల్కరాదు నీచుల కడ
నిజ మహాత్ము గూడ నిజమాడ వలయురా
విశ్వదాభిరామ వినురవేమ.

175) నీతి జ్యోతిలేక నిర్మలంబగు నేది
ఎట్లు కలగు బర మదెంతయైన
ధనము గలిగియున్న దైవంబు గలుగదు
విశ్వదాభిరామ వినురవేమ.

176) పతక మందు నొప్పు పలు రత్నముల పెంపు
బంగరమందు కూర్ప బరువు గనును
గాని ఇతరలోహమైన హీనము గాదె!
విశ్వదాభిరామ వినురవేమ.

177) పదుగురాడు మాట పాటియై ధరజెల్లు
నొక్కడాడు మాట యొక్క దెందు
ఊఋఅకుండు వాని కూరెల్లు నోపదు
విశ్వదాభిరామ వినురవేమ

178) మాల మాల కాడు మహి మీద నేప్రొద్దు
మాట తిరుగు వాడె మాల గాక
వాని మాల యున్న వాడె పో పెనుమాల
విశ్వదాభిరామ వినురవేమ.

179) మాటలాడవచ్చు మనసు నిల్పగలేడు
తెలుపవచ్చు దన్ను తెలియలేడు
సురియ బట్టవచ్చు శూరుడు కాలేడు
విశ్వదాభిరామ వినురవేమ.



180) ఏది కులము నీకు? నేది స్థలంబురా?
పాదుకొనుము మదిని పక్వమెఋఇగి
యాదరించు దాని నవలీల ముట్టరా
విశ్వదాభిరామ వినుర వేమ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి