1, ఆగస్టు 2010, ఆదివారం

వేమన సూక్తి ముత్కావళి

181) తన కులగోత్రము లాకౄతి
తన సంపద కలిమి బలిమి తనకేలనయా?
తన వెంట రావు నిజమిది
తన సత్యమె తోడవచ్చు దనతో వేమా.

182) నరకులమున దా బుట్టియు
నరకులమున దాను పెరిగి నరుడయ్యును దా
నరకులమును ఛీ ఛీ యని
హరకులమున దిరుగునేని హరుడౌ వేమా.

183) శూద్రతనము పోయె శూద్రుడుగానని
ద్విజుడనుకొనుటెల్ల దెలివిలేమి
ఇత్తడెసగు పసిడి కీడనవచ్చునా
విశ్వదాభిరామ వినుర వేమ.

184) శూద్ర యువతి కొడుకు శుధ్ధాంతరంగుడై
వేద వేద్యమైన పాదు దెలిసి
బ్రహ్మపదవి గన్న బ్రాహ్మణుడే గదా!
విశ్వదాభిరామ వినుర వేమ.

185) శూద్రులనుచు భువిని శూద్రుల భోనాడు
మాలకన్నదుడుకు మహిని లేడు
నరకమునకు నేగు నష్టమైన వెనుక
విశ్వదాభిరామ వినుర వేమ.

186) మాల మాల కాడు మహి మీద నేప్రొద్దు
మాట తిరుగు వాడె మాల గాక
వాని మాల యన్న వాడె పో పెనుమాల
విశ్వదాభిరామ వినుర వేమ.

187) కులము కలుగువారు గోత్రంబు కలవారు
విద్యచేత విఋఋఅవీగువారు
పసిడికల్గువాని బానిసకొడుకులు
విశ్వదాభిరామ వినుర వేమ.

189) కులము లేనివాడు కలిమిచే వెలయును
కలిమిలేనివాని కులము దిగును
కులము కన్న నెన్న గలిమి ప్రధానంబు
విశ్వదాభిరామ వినుర వేమ

190) అంటుముట్టునెంచి యదలించి పడవైచి
దూరమందు జేరి దూౠచుంద్రు
పుట్టి చచ్చు జనులు పూర్ణంబు నెౠగరు
విశ్వదాభిరామ వినుర వేమ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి