121) వలపు తీరెనేని వనజాక్షి యధరంబు
ములక పంటి గిజరు ముష్టిరసము
చింత పోంత యగును జీడి సమానమౌ
విశ్వదాభిరామ వినురవేమ
122) రూపులేని వనిత రూఢి పతివ్రత
నీటు లేనివాడు పోటు బంటు
తెలుపవచ్చు నెట్లు దేవరభంటుం
విశ్వదాభిరామ వినురవేమ
123) మొగము జూచినపుడె మోహంబు ఘనమౌను
ధనము జూచినపుడె తగులు మనసు
కూలి నష్టమైన గొరునే కొఋఅగామి
విశ్వదాభిరామ వినురవేమ
124) పచ్చదనము చూచి ఇచ్చను కాముకుల్
చిచ్చులో బడుదురు క్షితితలమున
ఇచ్చ కలుగజేయు హెచ్చుగా మోహంబు
విశ్వదాభిరామ వినురవేమ
125) పంకజాక్షి గన్న బంగరు బొడగన్న
దిమ్మపట్టియుండు తెలివియొప్పు
మనుజులకును తత్త్వ మహిమెట్లు కల్గురా
విశ్వదాభిరామ వినురవేమ
126) చక్కెఋఅ కలిపి తినంగా
ముక్కిన తవుడైన లెస్స మోహము కదుర
న్వెక్కుడు బానిసయైనన్
మక్కువ గను దివ్యభామ మహిలో వేమా
127) కన్నెల నవలోకింపగ
జన్నులపై ద్రుష్టి పాౠ సహజం బిలలో
కన్నుల కింపగు ద్రుష్టిని
తన్నెౠగుట ముక్తికిరవు తగునిది వేమా
128) ఆలు రంభయైన నతిశీలవతియైన
జారపురుషుడేల జాడమాను
మాలవాడకుక్క మఋఅగిన విడుచునా
విశ్వదాభిరామ వినురవేమ
129) వారకాంతలెల్ల వలపించి వత్తురు
బుధ్ధులెల్ల తొలగబుచ్చు కొఋఅకు
మాట రూఢిగాగ మగలెల్ల వత్తురు
విశ్వదాభిరామ వినురవేమ
130) రాజసంబు చెంది రమణుల పొందాస
పడెడువాడు గురుని ప్రాపెౠగునె
విటుల మరుగు యువతి విభుభక్తి యెౠగునా
విశ్వదాభిరామ వినురవేమ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి