1, ఆగస్టు 2010, ఆదివారం

వేమన సూక్తి ముత్కావళి

91) కుళ్ళుబోతునొద్ద గూడి మాటాడిన
గొప్ప మ్ర్మములను చెప్పరాదు
పేరు తీరుదెల్ప నూరెల్ల ముట్టించు
విశ్వదాభిరామ వినురవేమ.


92) కొండముచ్చు పెండ్లి కోతిపేరంటాలు
మొండివాని హితుడు బండవాడు
దుండగీడునకును కొండెడు దళవాయి
విశ్వదాభిరామ వినురవేమ.


93) కొండెగాడు చావ గొంపవాకిటికిని
వచ్చిపోదురింతె వగపులేదు
దూడ వగచునె భువిదోడేలు చచ్చిన
విశ్వదాభిరామ వినురవేమ


94) గాడ్దెయేమెౠంగు గంధపువాసన
కుక్కయేమెౠంగు గొప్పకొద్ది
అల్పుడేమెౠంగు హరుని గొల్చు విరక్తి
విశ్వదాభిరామ వినురవేమ.

(ఎంత చదువు (దెగ్రీలు) వున్ననూ
ఎన్ని లక్షల డోలర్లు ఆర్జించిననూ
అల్పునకు ఞానమన్న రుచింపదు, బుర్రకెక్క్దు.)


95) చంద్రునంతవాడె శాపంబు చేతను
కళల హైన్యమంద గలిగె గదర!
పుడమి జనులకెల్ల బుధ్ధు లిట్లుండురా.
విశ్వదాభిరామ వినురవేమ.


96) వాదమాడడెపుడు వరుస నెవ్వరితోడ
జేరరాడు తాను చేటుదేడు
ఞాని యగుచు బుధుడుఘనత బొందగజూచు
విశ్వదాభిరామ వినురవేమ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి