31) దుష్టజనులు మీఋఇ తుంటరిపనులను
శిష్టకార్యములుగ జేయుచుంద్రు
కూడదనెడువారి గూడ నిందింతురు
విశ్వదాభిరామ వినురవేమ.
32) దూరద్రుష్టిగనరు తూగిదనుకను
బారుపట్టెౠగౌ పడినదనుక
దండసాధ్యులరయ ధర్మసాధ్యులుకారు
విశ్వదాభిరామ వినురవేమ.
33) నేరని జనులకును నేరముల్ నేర్పుచు
చక్కచేయరిల నసాధులెపుడు
ఒప్పు దుర్జనములు తప్పగనెంతురు
విశ్వదాభిరామ వినురవేమ.
34) నొసలు బత్తుడయ్యె నోరు తోడేలయ్యె
మనసు భూతమువలె మలయగాను
శివుని గాంతు ననుచు సిగ్గేలగాదురా?
విశ్వదాభిరామ వినురవేమ.
35) పరులు చదువజూచి నిరసనబుధ్ధితో
వట్టిమాటలాడు వదరుబోతు
అట్టి ఖలుని జాడలరయుట దోసము
విశ్వదాభిరామ వినురవేమ.
36) పాలు పంచదార పాపరపండ్లలో
చాలబోసి వండ జవికిరావు
కుటిలమానవులకు గుణమేల కల్గురా?
విశ్వదాభిరామ వినురవేమ.
37) బిడియ మింతలేక పెద్దను నేనంచు
బొంకములను బల్కు సంకఠునకు
ఎచ్చు కలుగదిచట జచ్చిన రాదట
విశ్వదాభిరామ వినురవేమ.
38) మాటలాడు టొకటి మనసులో నొక్కటి
ఒడలిగుణ మదొకటి నడత యొకటి
ఎట్లుకలుగు ముక్తి యిట్టులుండగ తాను
విశ్వదాభిరామ వినురవేమ.
39) ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు
పరగ మూలికలకు బనికివచ్చు
నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు?
విశ్వదాభిరామ వినురవేమ.
40) రేగుపుచ్చకాయ రేయెల్ల దన్నిన
మురగ దంతకంత పెరుగుగాని
ఒరులు ఛీయన్నను నోగు సిగ్గెౠగునా?
విశ్వదాభిరామ వినురవేమ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి