1, ఆగస్టు 2010, ఆదివారం

వేమన సూక్తి ముత్కావళి

41) వంపుకఋఋఅగాచి వంపు తీర్చగవచ్చు
కొండలన్ని పిండిగొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరగింపరాదు
విశ్వదాభిరామ వినురవేమ.

42) వాక్కు శుధ్ధిలేని వైనదండాలు
ప్రేమ కలిగినట్టు పెట్టనేల?
నొసట బత్తిజూపు నోరు తోడేలయా
విశ్వదాభిరామ వినురవేమ.

43) ఎంత చదువు చదివి యెన్ని నేర్చినగాని
హీనుడవగుణంబు మానలేడు
బొగ్గు పాలగడుగ బోవునా మలినంబు
విశ్వదాభిరామ వినురవేమ.

44) వేము బాలుపోసి వేయేండ్లు పెంచిన
జేదు విడిచి తీపి జెందబోదు
ఓగు గుణము విడిచి యుచితఞుడగు నెట్లు?
విశ్వదాభిరామ వినురవేమ.

45) వేౠ పురుగుచేరి వ్రుక్షంబు జెౠచును
చీడపురుగుచేరి చెట్టుజెౠచు
కుచ్చితుండు చేరి గుణవంతు జెరుచురా
విశ్వదాభిరామ వినురవేమ.

46) సారవిద్యలందు సరణి దెలియలేక
దూరమందు జేరు దుర్జనుండు
పరముదెలియ నతడు భావఞుడెట్లగు?
విశ్వదాభిరామ వినురవేమ.

47) అభిజాత్యముననె యాయువున్నంతకు
దిరుగుచుండ్రు భ్రమల దెలియలేక
మురికి భాండమునను ముసరునీగలరీతి
విశ్వదాభిరామ వినురవేమ.

48) ఇహమునందుబుట్టి ఇంగిత మెౠగని
జనుల నెంచి చూడ స్థావరములు
జంగమాదులనుట జగతిని పాపంబు
విశ్వదాభిరామ వినురవేమ.

49) ఎడ్డెదెల్పవచ్చు నేడాదికైనను
మౌనిదెల్పవచ్చు మాసముననె
మొప్పెదెల్పరాదు ముప్పదేండ్లకునైన
విశ్వదాభిరామ వినురవేమ.

50) ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన
నలుపు నలుపేకాని తెలుపు కాదు
కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా?
విశ్వదాభిరామ వినురవేమ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి