1, ఆగస్టు 2010, ఆదివారం

రాయబారం పద్యాలు -- తిక్కన vs తిరుపతి వెంకట కవులు

నంద కుమార, యుద్ధమున నా రథమందు వసింపుమయ్య, మ-
ధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి జేసి నా
స్యందన మొప్పుగాక, రిపు సంతతి తేజము తప్పు గాక, నీ
వెందును నాయుధమ్ము దరి కేగమి కొప్పుదు గాక, కేశవా
- తిరుపతి వేంకట కవులు


అని పలికి హరి గిరీటిన్
గనుగొని కొండొకవు నీవు గావున నీకున్
మును గోర బాడి యనవుడు
విని కృష్ణుని గోరికొనియె విజయుండెలమిన్
- తిక్కన


అన్నియెడలను నాకు దీటైనవారు
గోపకులు పదివేవురకుంఠ బలులు
కలరు నారాయణాఖ్య చెన్నలరు వారు
వారలొక వైపు, నేనొక్క్ వైపు, మరియు


యుద్-ధ మొనరింత్రు వారల
బద్-ధమ్మెందులకు, నేను పరమాప్తుడనై
యుద్-ధమ్ము త్రోవ పోవక
బుద్-ధికి తోచిన సహాయమొనరింతు.......
- ట్వ్ కవులు


నా పాటియ పది వేవురు,
గోపాలురు కలరు, సమద కోవిద బాహా
టోపాభిరామమూర్తులు,
చాపాద్యాయుధ కళావిశారద చిత్తుల్


నారాయణాభిదానులు
వారలు గయ్యంబు సేయు వారొక్కడ, నే
నూరక నిరాయుధ వ్యా
పారతమై నుండువాడ బరమాప్తుడనై


వారొకతల్, యే నొక తల
యీ రెండు దెరంగులందు నెయ్యది ప్రియ మె-
వ్వారికి జెప్పుడు దొలితొలి
గోరికొనన్ బాలునికి ద్గున్ బాడి మెYఇన్
- తిక్కన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి