1, ఆగస్టు 2010, ఆదివారం

హిమాలయోత్తుంగ శ్రుంగం

అడవి బాపిరాజు (1895-1952)

హిమాలయోత్తుంగ శ్రుంగం నీ బ్రతుకు
ఉమాపతీ న్రుత్యరంగం
దేశాల వాంఛలు
ఆశా హ్రుదయములు
నేలొదిలి పోలేని
శీతల తలాలలో
జీమూత పంక్తికై
వ్యోమ వర్త్మము చొచ్చి ఓసామి; ||హిమాల||


సర్వ పధ జన కోట్లు
సాగి యాత్రార్ధులై
జన్మలు పవిత్రమై
చదువులొంద
స్నాతులగు
సంగమానికి చేరు
నీ కళ్ళ తళతళలు
నీ మాట పాటలు
నీ నవ్వు రసములు
వేణీత్రయమ్మౌతు
నీ నుండి వెడలెరా
అది మహా సత్యమ్ము ||హిమాల||


శిల్ప సూత్రార్ధాలు
తెల్పు సౌందర్యాలు
స్వల్పమై మూర్తిలో
దేశ దేశాల
అశాంతాల
వెలిగిస్తూ
నీ బోసి నవ్వులో
నీ స్రుష్టి వాక్కులో

నీ కన్ను జంటలో
రేకలు తిరుగుతూ మహాత్మా;
లోకమోహనమయ్యె
హిమాలయోత్తుంగ శ్రుంగం నీ బ్రతుకు
ఉమాపతీ న్రుత్యరంగం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి