1, ఆగస్టు 2010, ఆదివారం

జయ జయ జయ ప్రియ భారత...

జయ జయ జయ ప్రియ భారత...


జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ సుస్యామల
సుశ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా
చరిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ
లాక్షారుణ పదయుగళా జయ


జయ దిశాంత గత శకుంత
దివ్యగాన పరితోషణ
జయౌ గాయక వైతాళిక
గళ విశాల పద విహరణ
జయ మదీయ మధురగేయ
చుంబిత సుందర చరణ జయ
----దేవులపల్లి కృష్ణ శాస్త్రి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి