ఆంధ్ర పౌరుషము
*******************
గోదావరీ పావనోదార వాఃపూర మఖిలభారతము మాదన్న నాడు
తుంగభద్రా సముత్తుంగ రావముతోడ కవులగానము శృతి గలయునాడు
పెన్నానదీ సముత్పన్న కైరవదళ శ్రేణిలో తెంగు వాసించునాడు
కృష్ణా తరంగ నిర్ణిద్రగానముతోడ శిల్పము తొలి పూజ సేయుణాడు
అక్షరజ్ఞానమెఱుగదో యాంధ్రజాతి
విమల కృష్ణానదీ సైకతములయందు
కోకిలపుబాట పిచ్చుకగూండ్లు కట్టి
నేర్చుకొన్నది పూర్ణిమా నిశలయందు
---విస్వనాథ సత్యనారాయణ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి