1, ఆగస్టు 2010, ఆదివారం

శ్రీ కృష్ణ రాయబారం

దోసమటంచెరింగియును దుందుడుకొప్పగ పెంచినారమే
మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా
రోసము గల్గినన్ కవి వరుల్ మము గెల్వుడు గెల్చిరేని ఈ
మీసము దీసి మీ పాద సమీపములన్ తలలుంచి మ్రొక్కమే!



తమ్ముని కొడుకులు సగపా-
లిమ్మనిరటు లిష్ట పడవేనియు నైదూ (1 మత్ర-షొర్త్- పడవదేనియు?)
ళ్ళిమ్మని రైదుగురకు ధ-
ర్మమ్ముగ నీ తోచినట్లు మనుపుము వారిన్



తనయుల వినిచెదవో నీ
తనయులతో నేమి యని స్వతంత్రించెదవో
చనుమొక రీతిని లెదే-
నని యగు వంశ క్షయంబు నగు కురునాధా



పతితులు కారు నీ ఎడల భక్థులు శుంఠలు కారు విద్యలన్
చతురులు మంచివారు నృప సంతతికిన్ తల లోని నాల్కల-
చ్యుథునికి గూర్చువారు రణ సూరులు పాండవులట్టివారలీ
గతి నతి దీనులై యడుగగా నిక నేటికి సంశయింపగన్?


చెల్లియొ చెల్లకో తమకు చేసిన యెగ్గులు సైచిరందరున్
యెగ్గుల నన్ని సైచిరా (అల్తెర్నతె)
తొల్లి గతించె నేడు నను దూతగ బంపిరి సంధి సేYఅ మీ
పిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపగ సంధి చేసెదో
ఎల్లి రణంబె గూర్చెదవొ యేర్పడ జెప్పుము కౌరవేశ్వరా



అలుగుటయే యెరుంగని మహా మహితాత్ము డజాత శత్రుడే
అలిగిన నాడు సాగరము లన్నియు నేకము గాక పోవు క-
ర్ణులు పది వేవు రైన నని నొత్తురు చత్తురు రాజ రాజ నా
పలుకుల విశ్వశింపుము విపన్నుల లోకుల గావు మెల్లరన్



జెండాపై కపి రాజు ముందు సిత వాజి శ్రేనియున్ గూర్చి నే
దండంబున్ గోని తోలు స్యందనము మీదన్ నారి సారించుచున్
గాందీవంబు ధరించి ఫల్గుణుడు మూకన్ చెండు చున్నప్పు డొ-
క్కండున్ నీ మొర నాలకింపడు కురు క్ష్మా నాధ సంధింపగాన్


సంతోషంబున సంధి సేయుదురె వస్త్రంబూద్చుచొ ద్రౌపదీ-
కాంతన్ జూసిన నాడు చేసిన ప్రథిజ్~అల్ దీర్ప భీముండు నీ
పొంతన్ నీ సహ జన్ము రొమ్ము రుధిరంబున్ ద్రావు నాదెని ని-
శ్చింతన్ తద్గదయున్ త్వదూరు యుగమున్ ఛేదించు నాడెనియున్


బావా ఎప్పుడు వచ్చితీవు? సుఖులే, భ్రాతల్, సుతుల్, చుట్టముల్?
నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?
నీ వంశోన్నతి గోరు భీష్ముడును, నీ మేల్గోరు ద్రోణాది బూ
దేవుల్ సేమముమై చెలంగుదురె, నీ తేజంబు హెచ్చింపుచున్


నంద కుమార, యుద్ధమున నా రథమందు వసింపుమయ్య, మ-
ధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి జేసి నా
స్యందన మొప్పుగాక, రిపు సంతతి తేజము తప్పు గాక, నీ
వెందును నాయుధమ్ము దరి కేగమి కొప్పుదు గాక, కేశవా

ఆలము సేయ నేనని యథార్ధము జెప్పితి జుమ్మి, యిట్టి గో
పాలుని నన్ను గోరితివి, భండన పండితులగ్నితేజు లు-
త్తాల ధనుర్ధరుల్, బహురణప్రమితుల్ యదుసిమ్హులందరిన్
(ఉన్సురె ఒఫ్ థిస్)
బాలుగ గైకొనెన్ గురునృపాలుడు, బాలుడవైతి వక్కటా


ఉన్నది పుష్ఠి మానవులకో యదుభూషణ, యాల జాతికిన్
తిన్నది పుష్ఠి, నీ వరుగుదెంచి రథంబున నున్న జాలు, నే
సున్నము జేసెదన్ రిపుల చూపరులద్భుత మంద, సర్వ లో-
కోన్నత, నాకు పేరొసగు, మూరక చూచుచునుండు మచ్యుతా


ఊరక చూచుచుండుమనుటొపీతి గాని, భవద్రధస్థు నన్
బారగ జూచి నీ రిపులు ఫక్కున నవ్వి యనాదరింతురా
శూరకులంబు మెచ్చ రిపుసూదనతాభర మూను నీకు నే
సారధినై, యికన్ విజయసారధి నామమునన్ జరించెదన్


వచ్చెడి వాడు గాడతడు వారికి మీకును గూడ తోడు, వి-
వ్వచ్చుడ, యమ్మహామహుని భావము మున్నె యెరింగినాడ, నా
సచ్చరితుండు మీకు దగ సంధి పొసంగిన సంతసించు, నా
యిచ్చయు నట్టిదే, మన నరేంద్రుని యిచ్చయు గూడ నట్టిదే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి