1, ఆగస్టు 2010, ఆదివారం

చంపకమాల

లక్షణములు:
నజభజజ్జలరేఫలు పెనంగి దిశాయతి తోడ గూడినన్
త్రిజగదభిష్టుతా బుధనిధీ విను చంపకమాలయై చనున్


పాదాలు: నాలుగు

ప్రతి పాదంలోనూ అక్షరల సంఖ్య = 21

ప్రతిపాదంలోని గణాలు: న, జ, భ, జ, జ, జ, ర

యతి : ప్రతిపాదంలోనూ 11 వ అక్షరము

ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు

ఉదాహరణ :
పదముల బట్టినం దలకుబా టొకయింతయు లేక శూరతన్

మదగజవల్లభుండు మతిమంతుడు దంతయు గాంత ఘట్టనం

జెదరగ జిమ్మె నమ్మకరిచిప్పలు పాదులు దప్పనొప్పఱన్

వదలి జలగ్రహంబు కరివాలముమూలముజీరె గోఱలన్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి