--------------------------------------------------------------------------------
యుహుహూ అని వణికింపచేసే చలికాలం మరల నెమ్మదిగా అడుగుపెడుతోంది. బళ్ళో ఒకప్పుడు చదువుకొన్న "శీతకాలం" పద్యాలను జ్ఞ్పతికి తెచ్చుకొందాం ..
--------------------------------------------------------------------------------
అహములు సన్నములయ్యెను
దహనము హితమయ్యె, దీర్ఘదశలయ్యె నిశల్
బహుశీతోపేతంబయి
యుహుహూ యని వడకె లోక ముర్వీనాధా
శిశిర మరుదెంచెనంతట
నిశలాయతగతి వహించె, నెత్తమ్మి తెగల్
కుశలత డించె; దినంబులు
కృశియించె; వడంకు ముంచె నెల్లజనములన్
కాచెను సిరికలు తఱ్చుగ
బూచెన్ జేమంతి విరులు; భూమికి బరువై
తోచె జణకాది సస్యము
లేచెం బలుమంచు చదల హేమంతమునన్
శంభు కంట నొకటి, జలరాశి నొక్కటి
మఱియునొకటి మనుజమందిరముల
నొదిగెగాక; మెఱ్సియున్న మూడగ్నులు
చలికి నులికి భక్తి సలుపకున్నె
పొడుపు గొందమీద బొడుచుట మొదలుగా
బరువుపెట్టి యినుడు పశ్చిమాద్రి
మఱుగుజొచ్చెగాక మసలిన జలిచేత
జిక్కె జిక్కెననగ జిక్కకున్నె
దినము బ్రాతస్నానమొనరించు ద్విజులకు
నగుకర్మలోప భయంబుకంటె
బ్రాచిపనుల్ సేయ లేచు కోడండ్రకౌ
నత్తలవలని భయంబుకంటె
గడువులో దూరమేగగనున్న చరులకు
నధిపుచేనొదవు భయంబుకంటె
గర్షణం బొనరిప గడగు కాపులకార
యమి బైరు చెడునన్ భయంబుకంటె
గడిదియయ్యె శీతు; ఖగ, మృగ, పశు, నర
ప్రముఖ జంతువులకు భావములను
హెచ్చె గాంక్ష గోరువెచ్చని స్పర్శపై
శిశిరమహిమ వినుతిసేయవశమె?
ప్రాతర్వేళల మంచుచింకుగువి జొంపంబైనలేబచ్చికల్
శ్వేతశ్రీదులకించు టెంతయు రహించెన్ సర్వభూతంబులన్
శీతశ్రాంతి వడంకదానచలయై చెల్వొందు భూదేవికిన్
శీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశిం బోలి నల్వంకలన్
కొండలెల్ల మంచు గొండలై కనిపించె
నడవులెల్ల బూచినటులమించె
దీవులెల్ల దెల్లదీవులై రహిగాంచె
మాపురేపు మించు మంచువలన
ఎల్లజనముల దలసూపనీక వెలయు
నల్లహేమంత ఋతురాజు యశము దిశల
నావరించెనొ యనంగ మంచగ్గలించె
రోదసి నతంద్ర చంద్రికా రుచిర రుచుల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి