ఆంధ్ర మహా భాగవతము - ప్రథమ స్కంధము,
కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి గగన భాగంబెల్ల గప్పికొనగ
నురికిన నోర్వక యుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి గదల
జక్రంబు జేపట్టి చనుదెంచు రయమున బైనున్న పచ్చని పటము జార
నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువ
గరికి లంఘించు సిమ్హంబు కరణి మెరసి
నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు
విడువు మర్జున యనుచు మద్విశిఖవృష్టి
దెరలి చనుదెంచు దేవుండు నాకు దిక్కు
ఆంధ్ర మహా భాగవతము - సప్తమ స్కంధము
కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు, శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు, మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి
దేవదేవుని జింతించు దినము దినము
చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు
కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు
తండ్రి! హరి జేరుమనియెడి తండ్రి తండ్రి!
ఆంధ్ర మహా భారతము - పర్వము, -తిక్కన - 1
ద్రౌపది భీమునితో ధర్మరాజు మహిమ చెప్పుట
ఎవ్వని వాకిట నిభమదపంకంబు రాజభూషణ రజోరాజి నడగు
నెవ్వని చారిత్ర మెల్ల లోకములకు నొజ్జయై వినయంబు నొరపు గరపు
నెవ్వని కడకంట నివ్వతిల్లెడు చూడ్కి మానిత సంపద లీనుచుండు
నెవ్వని గుణలత లేడు వారాసుల కడపటి కొండపై గలయ బ్రాకు
నతడు భూరి ప్రతాప మహా ప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీర కోటీర మణి ఘృణి వేష్టితాంఘ్రి
తలుడు, కేవల మర్త్యుడె ధర్మసుతుడు!
ఆంధ్ర మహా భాగవతము - దశమ స్కంధము
పేర్వేర బొమ్మల పెండ్లిండ్ళు సేయుచు నబలల తోడ వియ్యంబు లందు
గుజ్జెన గూళ్ళను గొమరొప్ప వండించి, చెలులకు బెట్టించు జెలువు మెరసి
రమణీయ మందిరారామ దేశంబుల బువ్వుదీగెలకును బ్రోది వెట్టు
సదమల మణిమయ సౌధ భాగంబుల లీలతో భర్మ డోలికల నూగు
బాలికలతోడ జెలరేగి బంతు లాడు
శారికాకీర పంక్తికి జదువు సెప్పు
బర్హి సంఘములకు మురిపములు గరపు
మద మరాళంబులకు జూపు మంద గతులు
ఆంధ్ర మహా భాగవతము - దశమ స్కంధము ,
ఘుమఘుమా రావ సంకుల ఘోర జీమూత పటల సంచన్నాభ్ర భాగమగుచు
జటుల ఝంఝానిలోత్కట సముద్ధూత నానా విధ జంతు సంతాన యగుచు
జండ దిగ్-వేదండ తుండ నిభాఖండ వారి ధారా పూర్ణ వసుధ యగుచు
విద్యోత మనోగ్ర ఖద్యోత కిరణ జిద్విద్యుద్ద్యుతి-చ్చటా విభవ మగుచు
నడరి జడి గురియగ నిను డస్తమింప
భూరి నీరంధ్ర నిబిడా-ంధకార మేచి
సూచికా-భేద్యమై వస్తు గోచరంబు
గాని యట్లుండ మనము నవ్వాన దడిసి
ఈత్ రైనెద్ అంద్ థెయ్ గొత్ వెత్! భిగ్ డేల్!
ఆ సీసపద్యం : శ్రీశ్రీ
కారు మబ్బుల బారు సేరునేలెడి తీరు కోర మీసము పొందు కోరుకొందు
మృగరాజు జూలునే తెగనోడ జాలు నీ ఘన మీసము పసందు కనుల విందు
గండు చీమల దండు కదలాడినటులుండు నీ మీసము తెరంగు నీలరంగు
మెలిపెట్టి నెలబెట్టు మీసాల రోసాలు గగన మండలముపై కాలు దువ్వు
ఎవరు మోయుచున్నారు ఈ అవని భార-
మాదిశేషుడా, కూర్మమా? కాదు, కాదు
అష్టదిగ్గజ కూటమా ? అదియు కాదు
మామ మీసాలె భువికి శ్రీరామ రక్ష
శృంగార నైషధము బ్య్ శ్రీనాథుడు, - 1
హంస(లు), దమయంతి-తో
నళిన సంభవు వాహనము వారువంబులు కులము సాములు మాకు కువలయాక్షి
చదలేటి బంగారు జలరుహంబుల తూండ్లు భోజనంబులు మాకు పువ్వుబోణి
సత్య లోకమునుండి సకల లోకంబులు ఆటపట్టులు మాకు అబ్జవదన
మధురాక్షరము లైన మా మాటలు వినంగ అమృతాంశులే యోగు అనుపమాంగి
శారదా దేవి ముంజేతి పలుకు చిలుక
సమద గజయాన సద్బ్రహ్మచారి మాకు
వేద శాస్త్ర పురాణాది విద్యలెల్ల
తరుణి, నీ యాన ఘంటా పథమ్ము మాకు
శ్రీనాథుడు,
కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా పురవీధి నెదురెండ బొగడ దండ!
ఆంధ్ర నైషధకర్త అంఘ్రి యుగ్మంబున దగిలియుండెను గదా నిగళ యుగము
వీరభద్రా రెడ్డి విద్వాంసు ముంజేత వియ్యమందెను గదా వెదురు గొడియ
సార్వభౌముని భుజ స్తంభమెక్కెను గదా నగరి వాకిట నుండు నల్ల గుండు
కృష్ణ వేణమ్మ గొనిపోయె వింత ఫలము
బిలబి లాక్షులు తినిపోయె తిలలు పెసలు
బొడ్డు పల్లెను నమ్మితి మోస పోతి
ఎట్లు చెల్లింతు టంకమ్ము లేడు నూర్లు?
కాళ్ళకూరి నారాయణ రావు, చింతామణి నాటకం - 1
తాతల నాటి క్షేత్రము లెల్ల తెగనమ్మి దోసిళ్ళతో తెచ్చి పోసినాను
తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు నిచ్చి నీకు వస్తువులు చేయించినాను
అత్తవారిచ్చిన అంటు మామిడితోట నీవు కోరగ వ్రాసి యిచ్చినాను
కులసతి మేని సొమ్ములు పుస్తెతో గూడ కొనివచ్చి నీయింట గుప్పినాను
కులమువారెల్ల నీకిది కూడదనిన
భార్య నూతికి గోతికి పరువులిడిన
లెక్క చేయక నీయిల్లు కుక్కవోలె
కాచుకొని యిటులున్నాను, కలికి నేను
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి