11, ఏప్రిల్ 2011, సోమవారం

ఇనకుల తిలక ఏమయ్య రామయ్యా

ఆహిరి రాగం త్రిపుట తాళం

ప: ఇనకుల తిలక ఏమయ్య రామయ్యా
శ్రీరామచంద్రా విని వినకున్నావు
వినరాదా నామొర శ్రీరామచంద్రా || ఇనకుల ||

చ 1: కనకాంబరధర కపటమేలనయ్యా
శ్రీరామచంద్రా జనకాత్మజా రమణా
జాగుసేయకు శ్రీరమచంద్రా || ఇనకుల ||

చ 2: దశరథసుత నాదశ జూడవయ్యా
శ్రీరామచంద్రా పశుపతి నుతనామ
ప్రార్థించి మ్రొక్కెద శ్రీరామచంద్రా || ఇనకుల ||

చ 3: నేవే గతియని నెర నమ్మియున్నాను
శ్రీరామచంద్రా కావవే యీవేళ
కాకుత్స కులతిలక శ్రీరామచంద్రా || ఇనకుల ||

చ 4: వైకుంఠవాసుడ విని బాధ మాన్పవే
శ్రీరామచంద్రా నీ కంటె గతిలేరు
నిర్దయజూడకు శ్రీరామచంద్రా || ఇనకుల ||

చ 5: రామభద్ర శైలధామ శ్రీరామ
శ్రీరామచంద్రా వేమరు వేడెద
రామదాసుని బ్రోవ శ్రీరామచంద్ర || ఇనకుల ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి