11, ఏప్రిల్ 2011, సోమవారం

అంతా రామమయం బీ జగమంతా రామమయం

వరాళి రాగం ఆది తాళం

ప: అంతా రామమయం బీ జగమంతా రామమయం || అంతా ||

చ1: అంతరంగమున ఆత్మారాము డ
నంత రూపమున వింతలు సలుపగ || అంతా ||

చ2: సోమ సూర్యులును సురలు తారలును
ఆ మహాంబుధులు నఖిల జగంబులు || అంతా ||

చ3: అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగ || అంతా ||

చ4: నదులు వనంబులు నానా మృగములు
విదిత కర్మములు వేదశాస్త్రములు || అంతా ||

చ5: అష్ట దిక్కులును ఆదిశేషుడును
అష్ట వసువులును అరిషడ్వర్గము || అంతా ||

చ6: ధీరుడు భద్రాచల రామదాసుని
కోరిక లొసగెడి తారక నామము || అంతా ||

1 కామెంట్‌:

  1. హేమంతోదయాన హరిత వేదికలపై మంచు ముత్యపు సొగసుల సిరులు నా తెలుగు అక్షర రమ్యాలు...మౌర్యుల కాలం నుండి ఇప్పటి వరకు తెలుగు లిపి పరిణామం చూడండి

    రిప్లయితొలగించండి