తెలుగు భాష మరియు ప్రాచీన ఆంద్రుల సంస్కృతీ,విశేషాలు గురించి మనకు రకరకాల ఆధారాలు ఉన్నవి .అవి శాసనాలు,నాణేలు,సాహిత్య ఆధారాలు,కైఫీయతులు,కెయిరనులు లేదా రాక్షసగుళ్ళు మొదలైనవి.అందులో కెయిరనులు లేదా రాక్షసగుళ్ళు గురించి తెలుసుకుందాం.
కెయిరనులంటే పూర్వకాలపు సమాధులు .భుగర్బాన్ని తవ్వడం వళ్ళ ఇవి బయల్పడుతాయి.కేయిరనులు రాయలసీమలోనూ,తెలంగాణా ప్రాంతాలలోను ఎక్కువగా కనిపిస్తాయి.ఒక పెద్ద గుంతతీసి,అందులో రాతి పలకలతో చిన్న చిన్న ఇళ్ళలాగా నిర్మించి,దాంట్లో శవాన్ని ఉంచటం ప్రాచీన ఖనన పద్దతి.మరణించిన వాళ్ళ విశ్వాసాలకనుగుణ౦గా వస్తు సామాగ్రిని సమాధిలో ఉంచి దాన్ని మట్టితో పూడ్చివేస్తారు.సమాదిచుట్టు వలయాకారంగా పెద్ద పెద్ద బండరాళ్ళను పేర్చుతారు.వీటిని చూచి ప్రజలు ఆశ్చర్యపడి వీటికి "రాక్షసగుళ్ళు" అని పేరు పెట్టినారు.బేగంపేట్,మౌలాలి,రాయగిరి,మానుకోట,డోర్నకల్లు,మధిర మొదలైన ప్రాంతాలలో కేయిరన్లు ఎన్నో కనిపించాయి.వాటిల్లో వివిధ పరిమాణాలున్న కుండలు కనిపించాయి.ఆ కుండలపయిన కొన్ని సంకేత చిహ్నాలు ఉన్నాయి.అలాంటి చిహ్నాలు మొహంజోదారోలోని ప్రాచీన నాణాలమీద కూడా కనపడుతున్నాయి.కేయిరన్లలో తూర్పున గొడ్డలి,పడమట మట్టి పాత్ర,ఉత్తరాన రాగి గిన్నె,దక్షిణాన కుండలు ఉంచేవారు. మౌలాలి కేయిరన్లలో అందమైన కట్టి దొరికింది.అందులో మృత పురుషుడు వీరుడు అయి ఉండవచ్చు.డోర్నకల్లు సమాధిలో కొడవలి దొరికింది.అతడు కృషీవలుడు అయి ఉంటాడు.
రెండువేల సంవత్సరాలకు పూర్వమే రాయలసీమ,తెలంగాణా ప్రాంతాలల్లో నాగరికత తెలిసిన ప్రజలు ఉండేవారని కేయిరన్లను బట్టి తెలుస్తుంది.అప్పటి మనుషులు అయిదున్నర,ఆరడుగుల పొడవున్దేవారు.వాళ్ళు స్థిర నివాసాలు ఏర్పరుచుకొని వ్యవసాయం మొదలయిన వృత్తులను అవలంబించినారు.వాళ్ళలో నేర్పరులయిన కమ్మరులు,కుమ్మరులు కుడా ఉండేవారు.వాళ్ళు చక్కని పనిముట్లను తయారు చేసేవారు.ఆ కాలపు శిల్పులు పెద్ద పెద్ద బండరాళ్ళను మలిచే నేర్పు కలిగి ఉండేవారు.వారి వస్తు పరిజ్ఞానం కూడా ఎన్నదగినది.వాళ్లకు పునర్జన్మఫై నమ్మకమున్నట్లు తోస్తుంది.ప్రాచీనా౦ద్రుల సంస్కృతీ ,విశేషాలు తెలుసుకోటానికి ఈ కెయిరనులు తోడ్పడతాయి.
“ తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స ” —శ్రీ కృష్ణదేవ రాయలు
3, సెప్టెంబర్ 2010, శుక్రవారం
30, ఆగస్టు 2010, సోమవారం
దిగంబర కవిత
సామాజిక సాహిత్య రంగాల్లో ఏర్పడ్డ స్తబ్దతను బద్దలుగోట్టే ఉద్దేశ్యంతో దిగంబర కవులు ఆవిర్భవించారు.పాత వ్యవస్తలోని అనేక విలువలను వీరు ప్రశ్నించారు .౧౯౬౫(1965)లో ప్రారంబమయి ౧౯౬౮(1968)వరకు మూడేళ్ళపాటు చెలరేగిన వీరి తిరుగుబాటు తెలుగు సాహిత్యరంగంలో సంచలనం కలిగించింది.
ఆరుగురు యువకులు ఒకచోట చేరి విచిత్రమైన కలం పేర్లతో దిగంబరకవిత్వాన్ని ఔద్దత్యంతో వెలువరించారు.అవి
౧.నగ్నముని-(కేశవరావు)
౨.నికిలేశ్వర్-(యాదగిరిరెడ్డి)
౩.చెరబండరాజు-(బద్దం భాస్కర్రెడ్డి)
౪.మహాస్వప్న-(కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు)
౫.జ్వలాముకి-(వీరరాగవాచార్యులు)
౬.భైరవయ్య-(మన్మోహన్ సహాయ్)
"ఈదేశంలో ,ఈ భూగోళంలో ఉపిరిపీల్చే ప్రతిమనిషి కోసం తపనపడి,భాదను చూసి వెక్కి వెక్కి ఏడ్చి ,పిచ్చేత్తి ప్రవచించిన కవిత్వం అని తమ కవిత్వ హేతువును గురించి చెప్పుకున్నారు.జీవచ్చవాలుగా బ్రతుకుతున్న ప్రజలను కోప్పడి,తిట్టి,భయపెట్టి,జుగుప్స కలిగించిన కవిత్వం దిగంబర కవులది.రాసింది వచన కవిత అయినా వీరు తమ కవితలను 'దిక్' అని పిలిచారు.దిగంబరశకం అనే కాలమానాన్ని కూడా ప్రకటించారు.సంవత్సరాలు,ఋతువుల పేర్లుమార్చారు.ముడుసంపుటాలు మాత్రమే వెలువరించి ముడేల్లలోనే దిగంబరశకం ముగిసింది.
నేటి సమాజంలో దుర్భర పరిస్థితులకు కారణమనుకున్న అందరిని దిగంబర కవులు తిట్టారు.స్వేచ్చా మానవుడి కోసం తపిస్తున్నామన్నారు.నేటి సమాజం కుష్టు వ్యవస్థగా మారిందని దీన్ని నాశనం చేయ్యాలనేకాకుండా 'ఏ ఆచ్చాదనకి తలోగ్గని ,ఏ భయాలకి లొంగని నిరంతర సజీవ మానవుని కోసం ఎలుగెత్తి పిలుస్తున్నాం'అన్నారు.
నగ్నముని రచించిన 'తోడవిరిగిన తరం'లో నిజం రెజర్ లాంటిది.అది సీజర్ని క్షమించదు.'అని హెచ్చరించాడు .చెరబండరాజు 'ఆకాశం వెక్కి వెక్కి ఏడుస్తోంది'అనే కవితలో.
"పుడమి తల్లి చల్లని గుండెను
పాయలు పాయలుగా చీల్చుకొని
కాల్వాలయి ఎవరిదో
ఏ తరం కన్నీరో
గలగల సుళ్ళు తిరిగి
మెల్లమెల్లగా పారుతుంది" అని వరదనీ వర్ణించాడు.
మహాస్వప్న 'మేం మనుషులం కాదు ఇంకేదో పేరుంది మాకు'అంటూ బాపు!మోసపోలేదు కదా నువ్వు'అని గాంధీని సంబోదిస్తూ భాద పడతారు.
"అన్నా ! భయపడకు
కరువు భత్యం పెరుగుతుంది.
కొండచిలువ నోట్లోకి ఈగపిల్ల దూకుతుంది ' అంటూ ప్రభుత్వాన్ని నమ్మిమోసపోవద్దని బైరవయ్య హెచ్చరించారు. రాచమల్లు రామచంద్రారెడ్డి వీరిని అరిషడ్వర్గాలతో పోల్చారు.౧౯౭౦(1970)లో విప్లవ రచయితల సంఘంలో చేరారు.వీరి సంస్థాపన తర్వాత దిగంబర కవిత్వం అంతరించిన్నట్లు భావించవచ్చు.

ఆంధ్రప్రదేశ్ లో గిరిజన భాషల వ్యాప్తి
ఆంధ్రప్రదేశ్ లో పెక్కు తేగల గిరిజనులు నివసిస్తున్నారు.వారు మాట్లాడే భాషలు కూడా చాల ఉన్నాయి.
వీటిలో కొన్ని భాషలను లక్షలమంది మాట్లాడుతుండగా కొన్ని భాషలను వందలమందే మాట్లాడుతున్నారు.గిరిజనులు ఆంధ్రప్రదేశ్ అంతటా వివిధ జిల్లాలలో ఉన్నారు.ఆదిలాబాద్ జిల్లాలోని ఏజన్సీ ప్రాంతాలలో "ఆద్,భిల్,గోండ్,కొలామ్,ప్రదాన్,తోటి"జాతులవారు అధిక సంఖ్యలో నివాసముంటున్నారు.ఖమ్మం వరంగల్ జిల్లాలలోని ఏజన్సీ ప్రాంతాలు 'కోయల' ప్రదాన నివాసభూమి.ఉభయ గోదావరి జిల్లాల మన్యప్రాంతాలలో 'కొండరేడ్లు'నివసిస్తున్నారు.విశాఖపట్నం ఏజన్సీ ప్రాంతాలలో బగత,మొండీ,దిగాయి,దులియా,ఝాడియా,కోబడి,కోతియో,మూనియా,మావి,మాలకల్,ముకదొర,పరంగి,పుంగు,రెడ్డిదొర,రోన,వాల్మీకి తెగలవారున్నారు.తూర్పు గోదావరి,విశాఖపట్నం,జిల్లాల ఎజన్సీలలో 'ఓజులు'వ్యాపించి ఉన్నారు.విశాఖ,శ్రీకాకుళం ఎజన్సీలలో -"గడబ,గౌడు,జాత,కొదు,కొండదొర,మన్నేదొర" తెగలవారున్నారు.కర్నూలు జిల్లాలో చెంచువారు,గుంటూరు,చిత్తూరు జిల్లాలలో కట్టునాయకన్ తెగలవారు విస్తారంగా ఉన్నారు.కోస్తా జిల్లాలలో;రాయలసీమ జిల్లాలలో ఏనాది,ఎరుకలవారు ఎక్కువగా ఉన్నారు.ఉత్తర తెలంగాణా జిల్లాలలో లంబాడి మరియు నాయక్ తెగలవారు ఉన్నారు.
ఆద్.భిల్ తెగలవారి భాషలగురించి భాషా శాస్త్రవేత్తలకుకుడా స్పష్టంగా తెలియదు.ఆద్ జాతివారు సుమారుగా ౧౨౦౦ (1200)మంది ,భిల్ జాతివారు ఒకవందమంది కంటే ఎక్కువ ఉండరు.
గోండీభాషను ఇటీవల పెక్కుమంది అధ్యయనం చేస్తున్నారు.గోండులు ప్రాచీన సంస్కృతీ కలిగిన జాతి దేవనాగరి ,మరాఠి,రోమన్,తెలుగు లిపులలో గోండి సాహిత్యం వెలువడింది.గోండిభాష మాట్లాడేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది.
కొలామి భాషలో సాహిత్యాన్ని అమెరికన్ భాషాశాస్త్రవేత్త ఎం.బి.ఎమీనో రోమన్ లిపిలో ప్రచురించాడు.కోయాభాషను కొందరు గోండి భాష మాండలికంగా తలచారుగాని అది ప్రత్యేకమైన భాషే.గోండి,కోయ భాషలలో అకాడమీ వారు వాచకాలను ప్రచురిస్తున్నారు.
'కొండరేడ్లు,దాదాపు ౪౦(40)వేలమంది ఉన్నప్పటికీ వారి భాష గురించిన వివరాలు తెలియవు.కొన్ని వందలమంది మాట్లాడే 'తోటి'జాతివారి భాషగురించి కూడా విశేషాలు తెలియవు.'బగత' తెగవారు సుమారుగా ఆరులక్షలమంది ఉన్నప్పటికీ వాళ్ళ భాషగురించి విశేషాలు తెలియవు.అలాగే దిదాయి,ధులియా,ఝులియా,కోబడి,కొటియా,మూలియా.మాలి మాలికర్ తెగలవారి భాషలగురించి కూడా శాస్త్రవేత్తలకు తెలియదు.ఇంకా ముకదోరాలు,పరంగి తెగలు,రెద్దిదొరలూ,రోనతేగా,వాల్మీకులు,గోడులు,జాతాపులు మొదలయిన వారి భాషలపయిన తగిన పరిశోదన జరుగలేదు.
గిరిజనులు మాట్లాడే భాషలలో కొన్నింటిని-పర్జీ,పెంగు మొదలయిన వాటిని ద్రావిడ భాషలుగా పరిశోదకులు గుర్తించారు.
చెంచులు సుమారు ౧౮(18)వేలమంది ఉన్నప్పటికీ వాళ్లభాష గురించి పరిశోదన ఇంకా జరుగలేదు.ఎరుకలభాషను తమిళభాషకు మాండలికంగా భాషాశాస్త్రవేత్తలు గుర్తించారు.సుగాలీలు లేక బంజారాలు మాట్లాడే భాషను రాజస్థానీ మాండలీకంగాతెలుసుకున్నారు.
గిరిజనుల భాషలను గురించి విస్తృతంగా పరిశోదనలు జరిగితెకాని అవి ఏయే భాషా కుటుంబాలకు చెందినవో చెప్పటం కుదరదు.గిరిజనులు మైదాన ప్రదేశాలకు వచ్చినప్పుడు తెలుగు నేర్చుకొని మాట్లాడటం తప్పటంలేదు.

28, ఆగస్టు 2010, శనివారం
లండన్ సంకల్పం
డాక్టర్ వెలుదండ నిత్యానందరావుగారు రచించిన "తెలుగు సాహిత్యంలో పేరడీ" అనే పుస్తకంలో నుంచి ఒక పేరడీ -
"ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధేశ్వేతవరాహకల్పే...." అని సంకల్పం చెప్పుకోవటం అందరికీ తెలిసిందే కదా...ఇది ఆంధ్రదేశంలో ఉన్న ఆంధ్రులకి సరిపోతుంది. మరి లండన్ లో ఉన్నవాళ్ళు సంకల్పం ఇలా చెప్పుకుంటారు అని చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు తెలియచేస్తున్నారు
"లండన్ వే స్వాహా జూశసే స్వాహ - క్రైస్తవే స్వాహా - ఇంగ్లండ్ - స్కాట్లండ్ - ఐర్లండ్ తత్త్రైస్తోర్వరేణ్యం - జుహోవా దేవస్య ధీమహీ - ధియోయోనః ప్రచోదయాత్" తో మొదలు అయ్యి "భూమేః పూర్వగోళార్థే యూరప్ఖండే, రష్యా, జర్మనీ, ఫ్రాన్సు, స్వీడనేత్యాది మహాదేశానాం పశ్చిమ ప్రాంతే - చతుస్సముద్ర ముద్రిత గ్రేటుబ్రిటన్నామక మహాద్వీపే చవియట్పర్వతస్య దక్షిణ దిగ్భాగే - వేల్సుదేశస్యాగ్నేయభాగే బ్రిస్టల్కుల్యాయాః ప్రాగ్దేశే...అస్మిన్వర్తమాన వ్యావహారిక హూణమానేన క్రీస్తో రనంతరం వింశతి తమ శతాబ్దే ...అఖండ థేంస్ నద్యాం వీరభద్రశర్మాహం జ్ఞానస్నానం కరిష్యే" ఇలా సాగిపోతుంది..
source.maganti.com
ఆవకాయ పాట
స్వర్గీయ మల్లినాథ సూరి గారు (కృష్ణా పత్రిక) ఒక వేసవికాలం బంధువుల పెళ్ళికి వెళ్ళిరావటం, ఆ నెలలోనే ఆవకాయ, మాగాయ కూడా పెట్టించటం మూలాన ఖర్చు చాలా అయ్యిందిట.అప్పుడు వారు కట్టి పాడిన పాట
మున్నాళ్ళ పెళ్ళికి ముప్ఫైయ్యి వదిలాయి రామచంద్రా!!
రైలువాడికి ఇస్తి రానూపోనూ ఇరవై రామచంద్రా!!
పెట్టికూలికి పోయె పైనొక్క రూపాయి
బండ్లవాళ్ళకు ఇస్తి పధ్నాలుగణాలు !!రామ!!
ఇంటావిడకు కుట్టిస్తి వంటిమెడ రెవిక !!రామ!!
ఒక్క రెవికకి పట్టె రొక్కమ్ము రెండు
కుట్టువాడికి ఇస్తి గట్టిగా బేడాను !! రామచంద్రా !!
ఫేషన్ అనుకొని పక్కనున్న ఆమె
టిక్కట్టు నేకొంటి రామచంద్రా
టిక్కెట్టుకే పట్టె జాకెట్టు ఖరీదు !!రామ!!
ఆవకాయకు అయేనా అరవయ్యి రూకలు !!రామ!!
మాగాయకు పట్టె మరి ఇరవై రూకలు !!రామ!!
లక్ష్మయ్యకే ఇస్తి సాక్షాత్తు యాభయ్యి !!రామ!!
కారమూ, ఉప్పును ఇంట్లోనే కొట్టిస్తి !!రామ!!
కాయలు స్వయముగా
చేయి చేసి తరిగితి !!రామ!!
ఇంత చేసిన పిదప ఎవడో చుట్టమువచ్చి
వఱ్ఱగా తినిపోవు ఎవడబ్బ సొమ్మని !!రామ!!
కొట్టులోపల అప్పు జోకొట్టితే పోవునా !!రామ!!
source.maaganti.com

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)